ఒకటి కంటే ఎక్కువ బూస్టర్ డోసులు వేసుకొవచ్చా? తీసుకుంటే ఏమవుతుంది?

Booster dose | కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను తీసుకొచ్చాయి. నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో చాలామంది నోటి నుంచి వినిపిస్తున్న మాట బూస్టర్ డోస్. మూడో డోస్ కూడా వేసుకోవడం వల్ల కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుందని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. మరి అది నిజమేనా? బూస్టర్ డోస్ తీసుకుంటే కొవిడ్-19 రాదా? ఒకటి కంటే ఎక్కువ బూస్టర్ డోసులు తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందా? అంటే.. దాని వల్ల మొదటికే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే బూస్టర్ డోస్ విషయంలో ఐసీఎంఆర్ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ అందరికీ సోకుతుందని.. ఇది కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోలేదని స్పష్టం చేశాడు. అలా అని ఈ వేరియంట్‌ను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇదిలా ఉంటే బూస్టర్ డోసులు ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సూచిస్తున్నాయి. వరుసగా బూస్టర్ డోసులు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నాయి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బలహీనపడుతుందని.. ప్రజలు కూడా తొందరగా అలసిపోతారని తెలిపారు. అందుకే బూస్టర్ డోసుల మధ్య గడువు చాలా ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరుసగా బూస్టర్ డోస్ తీసుకునే బదులు.. ఇన్ఫ్లుయెంజా మాదిరిగా చలికాలం ముందు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. బూస్టర్ డోసులు ఒకటి లేదా రెండు సరిపోతాయని.. అంతేగానీ.. అంతకుమించి తీసుకోవడం సరికాదని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నిపుణులు మార్కో కావలెరీ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Booster Dose | బూస్టర్ డోస్ ఒమిక్రాన్ వ్యాప్తిని ఆపలేదా.. నిపుణులు ఏమంటున్నారు?
దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ ప్రారంభం.. ఎవరెవరు అర్హులో తెలుసా..?
ఒమిక్రాన్ ఎందుకు వేగంగా వ్యాపిస్తోందంటే?.. మూడు కారణాలు చెప్పిన WHO శాస్త్రవేత్త
Omicron: మరో 8 వారాల్లోగా యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

