జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్ హన్స్ క్లూజీ తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్‌లో 70 లక్షల కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీని ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో ఈ అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్లు రెండితలు అయినట్లు తెలుస్తోంది. యూరోప్‌లో 8 వారాల్లోగా సగం మందికి ఒమిక్రాన్ సోకుతుందని సియాటిల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ సంస్థ వెల్లడించినట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి వైరస్ వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో యూరోప్‌తో పాటు సెంట్రల్ ఆసియా దేశాల్లోనూ తీవ్ర వత్తిడి ఉన్నట్లు చెప్పారు. జనవరిలో హాస్పిటళ్లు భారీ సంఖ్యలో పేషెంట్ల తాకిడిని తట్టుకోవాల్సి ఉంటుందని ఇటీవల ఫ్రాన్స్ ఆరోగ్యమంత్రి ఒలీవర్ వీరన్ తెలిపారు.