Okra Water | బెండకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటితో ఫ్రై, టమాటా కర్రీ, పులుసు, పకోడీ వంటివి చేసి తింటుంటారు. అయితే బెండకాయలను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే బెండకాయ నీళ్లను తయారు చేసి అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మనకు ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. రోజూ ఉదయాన్నే మీరు చక్కని హెల్తీ డ్రింక్ ను తాగాలని అనుకుంటున్నట్లయితే మీకు బెండకాయ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఈ నీళ్లను రోజూ తాగితే అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు.
బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. చురుగ్గా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల కూడా మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మైండ్ ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటుంది.
బెండకాయల్లో మెగ్నిషియం సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తేనెతో కలిపినప్పుడు మైండ్ ను రిలాక్స్ చేసే టానిక్‌గా పనిచేస్తుంది. అందువల్ల బెండకాయ నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడతారు. మెగ్నిషియం వల్ల మన శరీరంలో సెరొటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు నియంత్రించబడతాయి. దీంతో మూడ్ మారుతుంది. ఆహ్లాదంగా ఉంటారు. ఒత్తిడిగా అనిపించదు.
బెండకాయ నీళ్లలో లుటీన్, జియాజంతిన్ అనే పోషఖాలు ఉంటాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి. కంటి చూపును పెంచుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. వృద్ధాప్యంలోనూ కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
బెండకాయ నీళ్లు, నిమ్మరసం, తేనె కాంబినేషన్ చర్మానికి తేమను అందిస్తుంది. దీంతో కణాలు ఉత్తేజితం అవుతాయి. దీని వల్ల చర్మం మృదువుగా మారి కాంతివంతంగా తయారవతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ కాంబినేషన్ ఎంతో మేలు చేస్తుంది. చర్మం తేమగా ఉంటుంది. చర్మంలో నుంచి మృత కణాలు, టాక్సిన్లు బయటకు పోయి చర్మంలో కాంతి పెరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు బెండకాయ నీళ్లను తాగితే అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లను తాగడం వల్ల కీళ్లలో అరిగిపోయిన గుజ్జు సైతం మళ్లీ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎముకలు మునుపటికన్నా బలంగా మారుతాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఈ నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.
బెండకాయ నీళ్లను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతోపాటు ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అధికంగా ఆహారం తినలేరు. దీంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నీళ్లలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను తాగితే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా బెండకాయ నీళ్లను తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రిపూట బెండకాయలు 2 తీసుకుని నిలువుగా కట్ చేసి ఒక గ్లాస్ నీటిలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచిన తరువాత మరుసటి ఉదయం ఆ నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఈ లాభాలన్నింటినీ పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.