అమరావతి, మార్చి 25, 2025 : కాలిఫోర్నియాలోని బాదం పప్పు బోర్డు నేడు వివాంటా హోటల్లో(Vivanta Hotel) ‘రోజుకు ఒక గుప్పెడు బాదం పప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడటానికి సహజ విధానం’ అనే శీర్షికతో విశిష్ట పరిజ్ఞానంతో కూడిన సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్లో న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట, షీలా కృష్ణ స్వామి, ప్రముఖ భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత, వ్యవస్థాపకురాలు ప్రజ్ఞా అయ్యగారి సహా ప్యానెలిస్టులు పాల్గొన్నారు. వారు ఆహార సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాలిఫోర్నియా బాదం పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చడం, నేటి వేగవంతమైన జీవితంలో మొత్తం ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో ప్యానెలిస్టులు వెల్లడించారు. ఈ సెషన్‌కు ఆర్ జె సౌజన్య సంధానకర్త గా వ్యవహరించారు.
నేటి వేగవంతమైన ప్రపంచంలో సమతుల్య, ఆరోగ్యకరమైన జీవనశైలిని సాధించడం చాలా కష్టంగా మారింది. దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ఈ జీవనశైలి వ్యాధులు భారతదేశంలో ఏటా ఆరు మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు 2030 నాటికి దేశానికి $6 ట్రిలియన్ల నష్టం కలిగిస్తాయని అంచనా వేశారు. ఈ ఆరోగ్య సంక్షోభానికి పౌష్టికాహారం తీసుకోవడమేనని ప్రధాన కారణమని తెలిపారు.
డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అయిన కాలిఫోర్నియా బాదంలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం, డైటరీ ఫైబర్, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్నాయని, రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణ, రోగనిరోధక శక్తిని పెంచడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వెల్లడించారు. అదనంగా అత్యంత కష్టతరమైన తన షెడ్యూల్‌ను నిర్వహించడానికి ప్రజ్ఞా తాను అనుసరించే విధానాన్ని పంచుకున్నారు. పోషకాలు అధికంగా ఉండే బాదం వంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం, భోజన ప్రణాళిక, క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తానని వెల్లడించారు.
కాలిఫోర్నియాలోని ఆల్మండ్ బోర్డ్‌తో కలిసి ఇటీవల నిర్వహించిన యు గవ్ సర్వేను కూడా ఈ చర్చలో ప్రస్తావించారు, భారతదేశంలోని అగ్రగామి 5 శాఖాహార ప్రొటీన్ వనరులలో బాదం స్థానం పొందిందని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం అన్ని ప్రాంతాలలో 10 మందిలో 6 గురు కంటే ఎక్కువ మంది బాదంను అధిక ప్రోటీన్ వనరుగా గుర్తిస్తున్నారు. అలాగే 10 మందిలో 8 మంది తాము ప్రతిరోజూ బాదంను తీసుకుంటామని చెప్పారు, ఇది భారతదేశంలో పోషకమైన చిరుతిండిగా ప్రజాదరణను బలోపేతం వెల్లడిస్తుంది.
న్యూట్రిషన్ & వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ “మన బిజీ జీవనశైలి తరచుగా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుంది. చిన్న మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయని నేను నమ్ముతున్నాను. అల్ట్రా-ప్రాసెస్డ్ స్నాక్స్ కు బదులుగా బాదం వంటి సహజ ఎంపికలను చేసుకోవటం వంటివి దీనిలో ఉన్నాయని తెలిపారు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం మీరు సంతృప్తి చెందడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి , గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నిర్వహణ , మెరుగైన చర్మానికి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.
వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో బహుళ బాధ్యతలను నిర్వహించేటప్పుడు వీటిని తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శక్తివంతమైన మిత్రులుగా మారతాయి” అని అన్నారు. భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ విజేత మరియు వ్యవస్థాపకురాలు, ప్రజ్ఞ అయ్యగారి మాట్లాడుతూ “మోడలింగ్ పరిశ్రమలో ఉండటం వల్ల, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే నేను తరచుగా షూట్లలో పాల్గొంటుంటాను. నా బిజీ షెడ్యూల్‌కు సరిపోయే పోషకమైన, సహజమైన , అనుకూలమైన స్నాక్స్ కోసం నేను ఎల్లప్పుడూ వెతుకుతుంటాను. బాదం పప్పులు చిన్నప్పటి నుండి నాకు ఇష్టమైనవని తెలిపారు.
అవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తాయి. అనారోగ్యకరమైన చిరుతిండిని నివారించడానికి నాకు సహాయపడతాయి. నా దినచర్యలో బాదం పప్పును చేర్చుకోవడం వల్ల నా చర్మంతో సహా నా మొత్తం ఆరోగ్యంలో స్పష్టమైన తేడా వచ్చిందన్నారు. నేను వాటిని వాటి సహజ రూపంలో తినడానికి ఇష్టపడతాను. నేను ఎక్కడికి వెళ్లినా ఎల్లప్పుడూ నాతో ఒక పెట్టెను తీసుకెళ్లడం మాత్రం మరువను ” అని అన్నారు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ దినచర్యలలో చేర్చడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యకరమైన జీవనానికి బాదం ఎంతో ఉపయోగడుతుందని ప్యానెలిస్టులు తెలిపారు.