Breakfast | ఉదయం అల్పాహారంలో ఇవి తింటున్నారా? రోజంతా నీరసం వస్తుంది..!
కొన్ని రోజుల్లో ఎంతో ఉత్సాహంగా అనిపిస్తే.. మరికొన్ని రోజుల్లో అలసట, నీరసం వెంటాడుతుంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్థం కాదు. దీనికి వాతావరణాన్ని కారణంగా కొందరు భావిస్తారు. అయితే ఉదయం మనం తీసుకునే అల్పాహారం మన జీవక్రియపై ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ చెబుతున్నారు.
Breakfast | కొన్ని రోజుల్లో ఎంతో ఉత్సాహంగా అనిపిస్తే.. మరికొన్ని రోజుల్లో అలసట, నీరసం వెంటాడుతుంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్థం కాదు. దీనికి వాతావరణాన్ని కారణంగా కొందరు భావిస్తారు. అయితే ఉదయం మనం తీసుకునే అల్పాహారం మన జీవక్రియపై ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ చెబుతున్నారు. పాన్కేక్లు, పాలతో తృణధాన్యాలు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహా లేదా పండ్ల రసం వంటి అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయని ఆమె వివరించారు. ఇలాంటి అల్పాహారం తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర పెరిగి, ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోతుందని ఆమె తెలిపారు. ఇలాంటి అల్పాహారం తిన్న వెంటనే కొంతసేపు కడుపు నిండినట్లు అనిపించినప్పటికీ, త్వరగానే మళ్లీ ఆకలి వేస్తుందని చెప్పారు. ఉదయం అల్పాహారంలో ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని, ఆహారంపై వచ్చే కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆమె సూచించారు.
ప్రోటీన్లు ఉండే ఆహారాలు..
అల్పాహారంలో గుడ్డు భుర్జీ, టోఫు భుర్జీ, పనీర్ భుర్జీ, శనగపిండి చీలా వంటి సులభమైన ఆహారాలను ఆమె సూచించారు. ప్రొటీన్ అధికంగా ఉండే అల్పాహారం కండర ద్రవ్యరాశిని కాపాడుకోవడంలో, ఆహారంపై వచ్చే కోరికలను నియంత్రించడంలో, జీవక్రియకు మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. రోజును ప్రొటీన్‌తో ప్రారంభించాలని, జీవక్రియ అందుకు కృతజ్ఞతలు చెబుతుందని ఆమె అన్నారు. అంతకుముందు ఇచ్చిన వివరణల్లోనూ రోజంతా ఉండే అలసటను తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారం, జీవనశైలిలో కొన్ని సులభమైన మార్పులు చేసుకోవాలని అంజలి ముఖర్జీ సూచించారు. పాలకూర, కాలే, మెంతికూర వంటి ఆకుకూరలతోపాటు బెర్రీలు, సిట్రస్ పండ్లు వంటి రంగురంగుల పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆమె సూచించారు.
పనీర్‌ను ఇలా తీసుకోవాలి..
రోజును పండ్లతో ప్రారంభించి, ఆ తర్వాత ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. రోజును పండ్లతో ప్రారంభించాలని, పండ్లు తిన్న గంట తర్వాత కూడా ఆకలిగా ఉంటే ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవచ్చని, కావాలనుకుంటే గుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకోవాలని అన్నారు. అయితే మొత్తం గుడ్డు కూడా మంచిదేనని, ఆ తర్వాత టోస్ట్తోపాటు టమాటా, క్యారెట్, బీట్రూట్ రసం లేదా బూడిద గుమ్మడికాయ రసం తీసుకోవచ్చని సూచించారు. శాకాహారులు ఉదయం సుమారు 100 గ్రాముల పనీర్‌ను ఉప్పు, మిరియాల పొడి వేసి పెనంపై కాల్చుకుని తినవచ్చని, లేదా పనీర్ పరాఠా, పనీర్ భుర్జీ తీసుకోవచ్చని ఆమె సూచించారు. దీంతోపాటు ఒక గ్లాస్ కూరగాయల రసం తీసుకోవచ్చని తెలిపారు. పోషక అవసరాలను తీర్చడంతోపాటు శక్తి స్థాయిలను ఎక్కువగా ఉంచే అల్పాహారమే సరైన అల్పాహారం అని ఆమె వివరించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

