పెట్టుబడుల వేదికా? సైద్ధాంతిక సభా?
హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన భారత్ సమ్మిట్-2026 సదస్సు తీరుతెన్నులపై ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, డిసెంబర్లో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు సన్నాహకంగా భారత్ సమ్మిట్-2026ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
- భారత్ సమ్మిట్‌పై రాజకీయ వివాదం
హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన భారత్ సమ్మిట్-2026 సదస్సు తీరుతెన్నులపై ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, డిసెంబర్లో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు సన్నాహకంగా భారత్ సమ్మిట్-2026ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే వాణిజ్యపరమైన చర్చల కంటే రాజకీయ అంశాలకే ఈ సదస్సులో అధిక ప్రాధాన్యం ఇచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లకు బదులుగా వివిధ దేశాలకు చెందిన వామపక్ష, సోషలిస్ట్ రాజకీయ ప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా ఇది ప్రభుత్వ పెట్టుబడుల సదస్సులా కాకుండా కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక సభలా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సదస్సు నిర్వహణపై, సమ్మిట్‌కు హాజరైన వారిలో పెట్టుబడిదారులు ఎవరూ లేరని, కేవలం దేశ వ్యతిరేక శక్తులను ఆహ్వానించి భారతదేశాన్ని విమర్శించే వేదికగా దీనిని మార్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీయడానికే ఈ సదస్సు నిర్వహించారని, కనీసం ఒక పెట్టుబడిదారుడినైనా ఆహ్వానించకుండా పారిశ్రామిక సదస్సు పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనమేందని వారు ప్రశ్నించారు.
దేశ అంతర్గత వ్యవహారాలపై విమర్శలు!
భారత్ సమ్మిట్ వేదికపై మన దేశ అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ సంస్థలపై విదేశీ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ది పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ నేత గియాకోమో సహా పలువురు విదేశీవక్తలు భారత ఎన్నికల జాబితాలు, న్యాయవ్యవస్థ పనితీరుపై ఆరోపణలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించాల్సిన ప్రభుత్వ వేదికపై విదేశీయులను రప్పించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను విమర్శించేలా మాట్లాడించడం వల్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో దేశ ప్రతిష్ఠపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ వ్యక్తిగత ప్రచారం!
తెలంగాణ పన్ను చెల్లింపుదారుల నుంచి సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి రాహుల్‌గాంధీ వ్యక్తిగత పీఆర్ ప్రచారం కోసం ఈ సదస్సును ఉపయోగించుకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇలాంటి సదస్సులకు ప్రజాధనాన్ని వెచ్చించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న రాయితీలు, మౌలిక సదుపాయాలపై కీలక ఒప్పందాలు గానీ, పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశాలు గానీ జరిగిన దాఖలాలు కనిపించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

