ఈ స్నేహం చెడ్డది!
ఆఫీసుల్లో అనేక రకాలు వ్యక్తులు ఉంటారు. కొందరు కేవలం పని వరకే పరిమితమైతే.. మరికొందరు పర్సనల్‌గానూ కలిసిపోతారు. మన మంచిని కోరుకునే మిత్రులు పరిచయం అవుతారు. మనకు వెన్నుపోటు పొడిచే ద్రోహులూ తారసపడతారు. అలాంటివారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తేనే.. కార్పొరేట్ ప్రపంచంలో సాఫీగా ముందుకు సాగుతారు. ఆఫీసులో అడుగుపెట్టగానే.. ముఖంపై చిరునవ్వు రంగరించుకొని ‘హాయ్! ఈ వీకెండ్ ఎలా గడిచింది?’
ఆఫీసుల్లో అనేక రకాలు వ్యక్తులు ఉంటారు. కొందరు కేవలం పని వరకే పరిమితమైతే.. మరికొందరు పర్సనల్‌గానూ కలిసిపోతారు. మన మంచిని కోరుకునే మిత్రులు పరిచయం అవుతారు. మనకు వెన్నుపోటు పొడిచే ద్రోహులూ తారసపడతారు. అలాంటివారితో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తేనే.. కార్పొరేట్ ప్రపంచంలో సాఫీగా ముందుకు సాగుతారు. ఆఫీసులో అడుగుపెట్టగానే.. ముఖంపై చిరునవ్వు రంగరించుకొని ‘హాయ్! ఈ వీకెండ్ ఎలా గడిచింది?’ అని అడుగుతూ, మీ టేబుల్ దగ్గరికి వచ్చి పొగడ్తలు కురిపించే వ్యక్తి ఒకడుంటాడు. చూసేందుకు మీకు అత్యంత ఆప్తుడిలా, మీ విజయాన్ని కోరుకునే వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, మీటింగ్‌లో మీ పని గురించి బాస్ మెచ్చుకున్నప్పుడు అతను ఉన్నట్టుండి సైలెంట్ అయిపోతాడు.
మీరు కాఫీ తాగుతూ అతనితో పంచుకునే ఐడియా.. వారం తిరకుండానే అతని ప్రజెంటేషన్‌లో ప్రత్యక్షమవుతుంది. ఆఫీసులో అసూయ అనేది చాలా సాధారణ విషయం. అయితే, అదెప్పుడూ బయటికి కనిపించదు. స్నేహం అనే ముసుగులోనే దాగి ఉంటుంది. అలాగని, ఆఫీసులో మంచిగా ఉండే ప్రతి ఒకరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. చాలామంది నిజంగా మంచివాళ్లే ఉంటారు. తోటివారి విజయాన్ని చూసి నమస్ఫూర్తిగా సంతోషపడతారు. మనం చేయాల్సిందల్లా ఎవరు నిజమైన మిత్రులో.. ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవడమే! ఇందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
- మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. నిజమైన స్నేహితుడు మీ విజయాన్ని తకువ చేయడు, దానిని అదృష్టం లేదా టైమింగ్ అని కొట్టిపారేయడు.
- వ్యక్తుల మాటల కంటే చేతలను నమ్మండి. తలుపులు మూసి ఉన్నప్పుడు పొగడ్తలు, బయటికి వచ్చాక మౌనంగా ఉండేవారితో జాగ్రత్తగా మెదలండి.
- మీ కొత్త ఐడియాలను వెంటనే మిత్రుల దగ్గర బయటపెట్టకండి. పేపర్ మీదనో లేక గ్రూప్ మీటింగ్‌లోనో చెప్పేవరకు.. వాటిని మీ దగ్గరే ఉంచుకోండి. ముఖ్యమైన మాటలన్నిటినీ మెయిల్లో రాసుకోండి. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడానికి.. ఓ డిటెక్టివ్‌లా తిరగాల్సిన అవసరం లేదు. అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది.
- సహోద్యోగుల వ్యక్తిత్వంతోపాటు వారి ప్రవర్తనను కూడా చూడండి. ఎవరైనా డెడ్‌లైన్ మిస్ చేస్తే, మీ క్రెడిట్‌ను కొట్టేస్తే.. దాని గురించి మాత్రమే మాట్లాడండి.
- తీయని మాట, చిరునవ్వు మీ కష్టాన్ని దెబ్బతీసే హకును ఎవరికీ ఇవ్వవు. ప్రొఫెషనల్‌గా ఉంటూ మీ హద్దులను కాపాడుకోండి. మనుషులను వారి తీయని మాటలతో కాకుండా వారి దీర్ఘకాల అలవాట్లతో అంచనా వేయండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

