వెంట్రుకవాసిలో తప్పించుకున్నా!
తన నటనతో సౌత్, నార్త్ ప్రేక్షకులను సుదీర్ఘకాలంగా అలరిస్తున్నది నటి కాజల్ అగర్వాల్. తాజాగా, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘రామాయణ’ చిత్రంలో రావణుడి భార్య మండోదరిగా నటించి ప్రశంసలు అందుకున్నది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన అత్యంత భయానక సంఘటనను గుర్తుచేసుకున్నది.
తన నటనతో సౌత్, నార్త్ ప్రేక్షకులను సుదీర్ఘకాలంగా అలరిస్తున్నది నటి కాజల్ అగర్వాల్. తాజాగా, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘రామాయణ’ చిత్రంలో రావణుడి భార్య మండోదరిగా నటించి ప్రశంసలు అందుకున్నది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన అత్యంత భయానక సంఘటనను గుర్తుచేసుకున్నది. 2020లో ‘భారతీయుడు 2’ షూటింగ్ సమయంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో తాను వెంట్రుక వాసిలో తప్పించుకొని, ప్రాణాలతో బయటపడ్డానంటూ కాజల్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పీడకల అని ఆనాటి భయానక క్షణాలను తలచుకున్నది.
“ప్రమాదం జరిగిన రోజు ఒక కీలక యాక్షన్ సన్నివేశాన్నిచిత్రీకరిస్తున్నారు. అందుకోసం నేను 80 ఏళ్ల వృద్ధురాలి ప్రోస్థెటిక్ మేకప్‌తో సెట్లోని మానిటర్ వద్ద కూర్చున్నా. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒకసారిగా భారీ శబ్దంతోపాటు ఆర్తనాదాలు వినిపించాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. దాదాపు 100 అడుగుల ఎత్తయిన క్రేన్ కుప్పకూలి పోయింది” అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో సెట్లో ఉన్న వారందరితోపాటు కాజల్ కూడా ప్రాణ భయంతో పరుగులు తీసిందట. ఆ తొందరలో ఒక టేబుల్‌ను బలంగా ఢీకొని కింద పడిపోయిందట. “నిజానికి ఆ భారీ క్రేన్ సరిగ్గా నేను ఉన్న వైపే పడాల్సింది. కానీ కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నా!” అంటూ వెల్లడించింది కాజల్. ఆ ఘటన తర్వాత ఇంకా ప్రాణాలతో ఎలా బతికి ఉన్నానో తనకే అర్థం కాలేదని, ఆ దేవుడి కరుణ వల్లే తనకు ఎలాంటి గాయాలు కాకుండా పునర్జన్మ లభించిందని ఆమె పేర్కొన్నది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

