న్యూఢిల్లీ : వెన్నునొప్పి అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెట్టినా వయో వృద్ధులను మరింత బాధిస్తుంది. వెన్నునొప్పితో ప్రపంచవ్యాప్తంగా పలువురు వైకల్యం బారినపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాయం, వివిధ యాక్టివిటీల్లో పాల్గొనడం, మెడికల్ కండిషన్స్ కారణంగా వెన్నునొప్పి వెంటాడుతుంది.
వెన్నునొప్పిని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోకుంటే ఎదిగే వయసులో మరింత జటిలంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండరాల నొప్పులు, మంట, సూదిగుచ్చినట్టు నొప్పి వంటి పలు లక్షణాలు వెన్నునొప్పిలో కనిపించినా పలువురిలో పెయిన్ కాలివరకూ నొప్పి ఉంటుంది.
వంగిన సమయంలో, బరువులు ఎత్తినా, నిలుచోవడం, నడకలోనూ వెన్నునొప్పి బాధిస్తుంటుంది. వెన్నునొప్పిని సహజ సిద్ధంగా చికిత్స తీసుకుంటూ సర్జరీతో పనిలేకుండా అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే వెన్నునొప్పికి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.
హాట్, కోల్డ్ థెరఫీ
వ్యాయామం
మెడిటేషన్
కంటినిండా కునుకుతీయడం
మసాజ్
ఆక్యుపంచర్