Nails and Health | మనం మన శరీరం చెప్పే మాటలను వింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరం మాట్లడటమేంటని ఆశ్చర్యపోకండి! మాట్లాడటమంటే మనకు సూచనలు ఇవ్వడం. శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా మన ఆరోగ్య సమస్యలను గుర్తుపట్టవచ్చు. శరీరంలోని కొన్ని భాగాల్లో కనిపించే మార్పులు, ప్రభావం ఏదో ఒక అవయవంపై పడుతుందనే విషయాన్ని మనం గుర్తించడం ద్వారా భవిష్యత్లో మనల్ని చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలకు ముందస్తుగా చికిత్స పొందే వీలుంటుంది.
మన శరీరంలో చాలా రకాల మార్పులు గోచరిస్తుంటాయి. అయితే, మనం వాటిని పట్టించుకోం. జీవనవిధానం వల్లనో, అలవాట్ల వల్లనో, హార్మోన్ల మార్పుల వల్లనో అలా మారి ఉంటుందని అనుకుంటుంటాం. అలాకాకుండా కళ్లు, ముక్కు, నాలుక, గోళ్లు.. ఇలా ఒక్కో దాన్ని పరిశీలనగా గమనిస్తే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నమో తెలుసుకోవచ్చు. పెలుసు గోర్లు, బలహీనమైన గోర్లు, పొట్టు లేచినట్లు ఉండే గోర్లు కనిపిస్తుంటాయి. గోర్ల ఆకృతిలోగానీ, రంగులో గానీ ఏదైనా తేడా కనిపిస్తే మాత్రం అనారోగ్యం ఉన్నట్లుగా భావించాలి. గోర్లలో మార్పుల ద్వారా మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామో పరిశీలిద్దాం.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.