వరంగల్ : వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు 129 కిలోల గంజాయి స్వాధీనం ( Ganja Seize ) చేసుకొని, ఇద్దరు నిందితులను అరెస్ట్ ( Two Accused Arreste ) చేశారు. ఈమేరకు సోమవారం ములుగు రోడ్డులోని నార్కోటిక్స్ పోలీసు స్టేషన్లో నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ ఇద్దరు నిందితులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు.
కేరళకు చెందిన సాయుజ్, బిసల్లెల్ , అజిత్, ఒడిశాకు చెందిన విక్కీ ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటు పడి, అక్రమంగా డబ్బులు సంపాదించాలనీ గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నారు. 66 లక్షల 66వేల విలువ చేసే గంజాయి నీ కారులో ఒడిస్సా నుంచి బెంగళూరు కు తీసుకెళ్తున్న క్రమంలో, పక్క సమాచారం తో వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు వర్ధన్నపేటలో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు.

Ganja Seize 1
కారులో ఉన్న 61 ప్యాకెట్ లోని ఈ 129 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులు సాయుజ్, బెసలెల్ ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. పరార్ లో ఉన్న ఇద్దరు నిందితులు అజిత్, విక్కీ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.