Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల మూవీ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. తుంటి భాగంలో గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆమె కొన్ని వారాల పాటు షూటింగ్‌లకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక.. గాయం తర్వాత తొలిసారిగా ఓ నిశ్చితార్థ వేడుకలో కనిపించడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె సందడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు రష్మిక, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. వీడియోలో రష్మిక విజయ్ చేతిని పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ కనిపించారు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో విజయ్ ఆమెకు తోడుగా ఉన్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు రష్మిక త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. త్వరలోనే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో సందడి చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీమేల్ లీడ్ యాక్షన్ ఎంటర్టైనర్లో గోండు తెగకు చెందిన మహిళగా ఆమె కనిపించనున్నారు. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాల్లో రష్మిక డూప్ లేకుండా నటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె తుంటి భాగంలో గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు షూటింగ్‌లకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ షూటింగ్లలో పాల్గొననున్నట్లు సమాచారం.
మరోవైపు రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ‘రణబాలి’ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన లుక్స్, పాటలకు మంచి స్పందన వచ్చింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రాయలసీమ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయాలని భావించినప్పటికీ.. రష్మిక గాయం కారణంగా విడుదల తేదీని అక్టోబర్ 30కి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Ahh wow, such a sweet start to the day. 😀 Waking up to this adorable video of #ViRosh together at a wedding function in Hyd made my whole morning. 🥹✨
Cutu Looking 100% fit and glowing. 🥹❤️ Pure smiles. 💖 #RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/0PfrCeU1ur— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 24, 2026