Heart Attack : గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
Heart Attack : గుండెపోటు ఎప్పుడు, ఎవరిలో వస్తుందో చెప్పడం అసాధ్యం. గుండెపోటు వచ్చేవరకు గుండె సమస్య వస్తుందనే ఆలోచనే మనలో...

(Heart Attack) గుండె మనిషికి అత్యంత విలువైన అవయవం. పిడికిలి పరిమాణంతో ఉండే ఈ గుండె.. శుద్ధి చేసిన రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు అందిస్తుంది. నిరంతరం పనిచేస్తూ ఉండే గుండెకు ఏదైనా అవాంతరం ఏర్పడితే.. మనం ప్రాణాలు విడవాల్సి వస్తుంది. అందుకని మన ఆహారపు అలవాట్లు ఉత్తమమైనవిగా ఉండేలా చూసుకోవాలి. గుండెపోటు ఎప్పుడు, ఎవరిలో వస్తుందో చెప్పడం అసాధ్యం. గుండెపోటు వచ్చేవరకు గుండె సమస్య వస్తుందనే ఆలోచనే మనలో ఉండదు. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి కనిపిస్తుంది.
గుండెపోటు వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే.. అజీర్ణం సమస్య వచ్చి కడుపులో మంటగా ఉంటుంది. ఛాతి మధ్యలో నొప్పి వస్తుంది. ఛాతిలో ఏదో పట్టుకున్న భావన కలుగుతుంది. భుజం, మెడ, దవడ భాగాల్లో నొప్పి కనిపిస్తుంది. అలసట, చెమట, తలనొప్పి, పల్స్‌లో తేడాలు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో వచ్చే గుండెపోటు కంటే పగటిపూట, ఉదయం సమయంలో వచ్చే గుండెపోటు చాలా ప్రమాదకరమని నిపుణులు చెప్తుంటారు.
ఇవాళ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
- గుండెపోటుకు సంబంధించిన చాలా కేసులు సోమవారం సంభవిస్తాయి. వారం మొదటి రోజు ఎంతో ఒత్తిడి ఉండటమే దీనికి కారణమంట.
- శీతాకాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుంటుంది. వీకెండ్స్‌లో, జూలై వేసవి సెలవుల్లో మయోకార్డియల్ ఇన్ఫార్క్ష్నన్ (ఎంఐ) రేటు తక్కువగా ఉంటుందని తేలింది.
- మహిళల్లో గుండె పురుషుల కన్నా ఎక్కువగా పనిచేస్తుంది.
- మహిళల్లో గుండె కొట్టుకునే రేటు ప్రతి నిమిషానికి 78 గా, పురుషుల్లో 70 గా ఉంటుంది.
- ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నవారిలో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.
- మనుషుల గుండె సాధారణంగా 450 గ్రాముల బరువు ఉంటుంది. మహిళల్లో కొంచెం ఎక్కువ బరువు కనిపిస్తుంది.
- తొలి ఒపెన్ హార్ట్ సర్జరీ 1893 జూలై 9 న అమెరికాలో జరిగింది. ఈ సర్జరీని కార్డియోలాజిస్ట్ డాక్టర్ డేనియల్ హేల్ విలియమ్స్ చేశారు. ఈ సర్జరీలో ఎలాంటి ఎక్స్‌రే తీయకుండా, ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకుండా ఓపెన్ హార్ట్ సర్జరీని జరిపారు.
- ప్రపంచంలో తొలి పేస్‌మేకర్ ట్రాన్స్‌ప్లాంట్ 1958 లో స్వీడన్‌కు చెందిన వ్యక్తికి జరిపారు. ఆ వ్యక్తి దాదాపు 43 ఏండ్ల పాటు జీవించి 2001 లో తుదిశ్వాస విడిచాడు.
- జంతువుల్లో అన్నింటి కన్నా చిన్న గుండె ఫేర్ ఫ్లైలో ఉంటుంది. దీని గుండెను మనం మైక్రోస్కోప్‌లో చూడాల్సి ఉంటుంది.
- అన్నింటికన్నా పెద్ద గుండె బ్లూ వేల్లో ఉంటుంది. దీని గుండె బరువు దాదాపు 180 కిలోల వరకు ఉంటుంది.
చివరగా, మనం నవ్వుతూ, ఉల్లాసంగా ఉంటేనే మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టం కూడా బలపడుతుంది.
ఇవి కూడా చదవండి..
హర్యానా పాల్వాల్‌లో దారుణం.. ఒకే ఇంట్లో ఐదుగురి ఆత్మహత్య
నేను రాజీనామా చేయలేదు: ఓం ప్రకాశ్ సోని
గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

