Om Prakash Soni : నేను రాజీనామా చేయలేదు: ఓం ప్రకాశ్ సోని
Om Prakash Soni : డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని ఓంప్రకాశ్ సోని స్పష్టం చేశారు. ఫేస్బుక్లో ఆయన రాజీనామా చేసినట్లుగా...

అమృత్సర్ : (Om Prakash Soni) డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని ఓంప్రకాశ్ సోని స్పష్టం చేశారు. ఫేస్బుక్లో ఆయన రాజీనామా చేసినట్లుగా ఫేక్ రిజైన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో తాను రాజీనామా చేయలేదు మొర్రో అంటున్నాడాయన. ఇదే విషయాన్ని తిరిగి ఫేస్బుక్ ద్వారానే ప్రజలకు స్పష్టం చేయడం విశేషం. తాను రాజీనామా చేసినట్లు ఫేక్ రిజైన్ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఓంప్రకాశ్ సోని వెల్లడించారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజీనామాల పర్వం ప్రారంభమైంది. సిద్ధూకు మద్దతుగా పలువురు నాయకులు, ఆఫీస్ బేరర్లు తమ రాజీనామాలను ఒక్కొక్కటిగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంతలో, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ సోని రాజీనామా లేఖ సోషల్ మీడియాలో షేర్ అయింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా నిలబడి, కేబినెట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో రాశారు. అయితే, తాను రాజీనామా చేయలేదని, ఫేస్బుక్లో వచ్చిన లేఖ నకిలీదని ఓపీ సోనీ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
క్యాబినెట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఓంప్రకాశ్ సోని వెల్లడించారు. ఎవరైనా పుకార్లు వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సోని నవజ్యోత్ సింగ్ సిద్ధుతో కలిసి కనిపించడంతో.. రాజీనామా చేసినట్లు ఫేక్ న్యూస్ వైరల్ అయింది. కాగా, సిద్ధూకు మద్దతుగా క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన రజియా సుల్తానా రాజీనామా లేఖను యధాతథంగా సోని పేరుతో ఫేక్ లెటర్‌కు తీసుకోవడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..
గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

