Migraine : మీరు ఎప్పుడైనా మైగ్రేన్‌ను అనుభవించి ఉంటే అది కేవలం తలనొప్పి మాత్రమే కాదని, శరీరం మొత్తాన్ని హూనం చేస్తుందని మీకు తెలుసు. మైగ్రేన్‌తో తలలో తీవ్రమైన పోటు ఉంటుంది. వెలుతురును చూస్తే పోటు ఎక్కువ అనిపిస్తుంది. వికారంతో తలలో తిప్పుతుంది. మెదడు మబ్బుగా అనిపిస్తుంది. తలపోటును తగ్గించే ట్యాబ్లెట్స్‌తో తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత నొప్పి శరా మూమూలే ఉంటుంది. అయితే ఎలాంటి టాబ్లెట్స్ వాడకుండానే మైగ్రేన్ నొప్పిని తగ్గించే మార్గాలున్నాయని మీకు తెలుసా..?
కేవలం ఏడు రోజుల్లో మైగ్రేన్ నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. దీనికి పరిష్కారం ఆయుర్వేదం. ఆయుర్వేదంలో మైగ్రేన్లను ‘అర్ధవభేదక’ అంటారు. అర్ధవభేదక అంటే సగం తలనొప్పి అని అర్థం. మైగ్రేన్లు తరచుగా శరీరంలోని మూడు ప్రధాన శక్తులైన వాత, పిత్త, కఫాలలో అసమతుల్యతవల్ల సంభవిస్తాయి. మానసిక ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం లాంటివి వాత, పిత్త, కఫాల్లో అసమతుల్యతకు కారణమవుతాయి.
మన శరీంలో ఏ దోషం కారణంగా మనకు సమస్య వచ్చిందనేది తెలుసుకుంటే దానికి పరిష్కారాన్ని కనుగొనడం సులభం అవుతుంది. మన రోజువారీ అలవాట్లు, ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం, ఆయుర్వేద మూలికలను వినియోగించడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ధనియాల టీతో కేవలం ఏడు రోజుల్లోనే సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
– శ్వేతా షా, పోషకాహార నిపుణురాలు
న్యూరోవాస్కులార్ ఇన్ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, పేలవమైన పేగు ఆరోగ్యం మేగ్రేన్కు కారణాలని, ఆధునిక సైన్స్ చెబుతున్నాయి. కొత్తిమీర గింజలు మైగ్రేన్ తీవ్రతను, ఫ్రీక్వెన్సీని తగ్గించగల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.‘ది మెడికల్ జర్నల్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ధనియాలు మైగ్రేన్ సమస్యను తగ్గించడంలో, మైగ్రేన్ వేధించే సమయాన్ని తగ్గించడంలో, మైగ్రేన్ తిరగబట్టే ఫ్రీక్వెన్సీని తగ్గించడంలో స్వల్పకాల ప్రభావం చూపుతుంది. మైగ్రేన్ సమస్యకు ధనియాలు సరైన, సమర్థవంతమైన పరిష్కారము. దీనివల్ల సాధారణ కెమికల్ డ్రగ్స్‌వల్ల కలిగే దుష్ప్రభావాల లాంటివి దరిచేరవు.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ ధనియా గింజలను మరిగిస్తే దనియాల టీ రెడీ. ఈ ధనియాల టీని క్రమం తప్పకుండా ఏడు రోజులపాటు ప్రతిరోజూ తీసుకోవాలి. దాంతో మైగ్రేన్ నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదం సమగ్ర జీవనశైలి మార్పును ప్రోత్సహిస్తుంది. త్వరిత పరిష్కారాలను చూపే ఔషధాల కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది.
మైగ్రేన్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనానికి ఒక బోనస్ చిట్కాను కూడా శ్వేతా షా సూచించారు. న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు కలిగిన దాల్చిన చెక్కను, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన తేనెను కలిపి మృదువైన పేస్ట్‌ను తయారు చేసుకోలి. ఆ పేస్టును నుదిటిపై రాసుకుని 15-20 నిమిషాలు ఉండనివ్వాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఈ చిట్కాతో తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.