Heart Diseases | మహిళల కన్నా పురుషులకే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.. ఈ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకండి..
పురుషుల ఆరోగ్యం గురించి సమాజంలో ఇప్పటికీ చాలామంది బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
Heart Diseases | పురుషుల ఆరోగ్యం గురించి సమాజంలో ఇప్పటికీ చాలామంది బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించడం ప్రాణాలను కాపాడగలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచే బాలురకు బాధను బయటపెట్టకూడదని, బలంగా ఉండాలని నేర్పిస్తారు. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, ఎక్కువసేపు పని చేయడం వంటి కారణాలతో అలసట, ఛాతిలో అసౌకర్యం, ఒత్తిడి వంటి లక్షణాలను సాధారణ విషయాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ అలవాటు ఆరోగ్య సమస్యలు అత్యవసర పరిస్థితులకు చేరుకునే వరకు చికిత్స ఆలస్యం కావడానికి కారణమవుతోంది.
నిరంతర ఒత్తిడి ముఖ్య కారణం..
ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిలో దీపక్ సేథియా అనే పేషెంట్ ఒకరు. 40 ఏళ్లు కూడా నిండకముందే ఆయనకు గుండె రక్తనాళాల్లో స్టెంట్లు వేయాల్సి వచ్చింది. రోజుకు 14 గంటలపాటు పని చేయడం, నిరంతర ఒత్తిడి, శరీరం ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన పని కంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కుటుంబంతో ఆరోగ్యకరమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధులు దాదాపు పదేళ్లు ముందుగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 40 ఏళ్ల ప్రారంభ దశలోనే గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. నిరంతర మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు పనిచేయడం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఈ లక్షణాలు ఉంటే..
అలసట, ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం వంటి లక్షణాలను వయసు ప్రభావం లేదా గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి గుండె సమస్యలకు ముందస్తు హెచ్చరికలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే జిమ్‌కు వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మాత్రమే సరిపోదని, సరైన నిద్ర, ధూమపానం మానడం, ఒత్తిడిని నియంత్రించడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. పురుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడని లక్షణాల్లో నిరంతర అలసట, ఛాతిలో అసౌకర్యం లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నడుము చుట్టూ కొవ్వు ఒక్కసారిగా పెరగడం, నిద్ర సమస్యలు ముఖ్యమైనవి. గుండె ఆరోగ్యంతోపాటు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కూడా చాలా మంది పురుషులు నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జన సమస్యలు లేదా లైంగిక ఆరోగ్య సమస్యల గురించి వైద్యులను సంప్రదించేందుకు చాలామంది సంకోచిస్తారు. దీంతో వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం జరుగుతోంది.
తరచూ మూత్ర విసర్జన..
రాత్రిపూట తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండడం, అంగస్తంభన సమస్యలు వయసు కారణంగానే వస్తాయని భావించడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ సహా ఇతర తీవ్రమైన వ్యాధులకు సంకేతాలు అవుతాయి. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన పురుషులు, కుటుంబంలో ప్రోస్టేట్ వ్యాధుల చరిత్ర ఉన్నవారు పీఎస్ఏ (PSA) పరీక్ష గురించి వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. పురుషులు నిర్లక్ష్యం చేయకూడని ప్రోస్టేట్ సంబంధిత హెచ్చరిక లక్షణాల్లో రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండడం, అంగస్తంభన సమస్యలు ఉన్నాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, నడుము కొలత, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం, మూత్రపిండాల పనితీరు, విటమిన్ డి, విటమిన్ బి12 పరీక్షలు చేయించుకోవడం అవసరం. 45 ఏళ్లు దాటిన తర్వాత అవసరమైతే పీఎస్ఏ పరీక్ష కూడా చేయించుకోవాలి. అలాగే ప్రతి రోజు కనీసం ఆరు గంటలకు పైగా నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఛాతిలో నొప్పి లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను ఎప్పుడూ గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. పురుషులు ఆరోగ్యాన్ని పట్టించుకోరని కాదు, కానీ బాధను భరించడమే బలం అనే భావనతో లక్షణాలను దాచిపెడుతుంటారు. అయితే నిజమైన బలం శరీరం ఇచ్చే సంకేతాలను వినడంలో, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంలో, అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవడంలోనే ఉందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

