ప్రొస్టేట్ క్యాన్సర్‌తోపాటు మరికొన్ని క్యాన్సర్ల బారినపడుతూ పురుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్‌కు ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేదు. కానీ, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పొగాకు ఉత్పత్తుల వాడకం, జన్యుపరమైన సమస్యల కారణంగా మగవాళ్లు అధికంగా క్యాన్సర్ రోగాల బారినపడుతున్నారు. మగవాళ్లని వెంటాడుతున్న క్యాన్సర్లపట్ల వాళ్లకు అవగాహన ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పురుషులకు ఎలాంటి క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి? వాటికి కారణాలు, చికిత్సతోపాటు ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
Cancer | క్యాన్సర్.. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని బారినపడుతున్నవాళ్లు ఏటా పెరుగుతున్నారు. ఈ వ్యాధి సోకే సగటు వయసు కూడా తగ్గిపోతున్నది. ఆధునిక వైద్య విధానాలు, సాంకేతిక పద్ధతుల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. వీటి ద్వారా క్యాన్సర్‌ని గుర్తించడం, చికిత్స చేయడంలో ఎంతో మార్పు వచ్చింది. అయినా అవగాహనారాహిత్యం వల్ల క్యాన్సర్ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రొస్టేట్ క్యాన్సర్‌తోపాటు నోటి క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నవాళ్లలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు.
సిగ్గుపడితే సమస్యే
క్యాన్సర్ బారినపడిన పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్లే ఎక్కువ. సాధారణ క్యాన్సర్లతోపాటు పురుషులకు మాత్రమే వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడేవాళ్లు పెరగడం ఆందోళన కలిగించే పరిణామం. పురుష జననేంద్రియ వ్యవస్థలో ప్రొస్టేట్ అనే గ్రంథి ఉంటుంది. ఇందులో వీర్యం ఉత్పత్తి అవుతుంది. అలాగే మూత్ర విసర్జన, వీర్యస్ఖలనాలను ఇది నియంత్రిస్తుంది. ఈ గ్రంథి మూత్రం రావడం, మూత్ర విసర్జన ఆపడం వంటి (స్విచ్చింగ్) నియంత్రణలకు ప్రేరణనిస్తుంది. మూత్రాశయానికి కింద, పురష నాళానికి పైన ప్రొస్టేట్ గ్రంథి కడుపులో అమరి ఉంటుంది. ఇది పురుష జననాంగాలకు సమీపంలో ఉంటుంది. ఈ గ్రంథికి క్యాన్సర్ సోకితే దానిని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్ బారినపడినప్పుడు మూత్రం విసర్జనలో తేడాలుంటాయి. మంట లేదా నొప్పి, మూత్ర విసర్జన పూర్తయిన భావన కలగకపోవడం లాంటి మార్పులుంటాయి. అలసట ఉంటుంది. ఈ లక్షణాలను చాలామంది పట్టించుకోరు. పరీక్షలు చేయించుకోరు. అందువల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ని చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. తొలి దశల్లో గుర్తిస్తే ఏ క్యాన్సర్‌ని అయినా తేలిగ్గా నివారించవచ్చు. కానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు తొందరగా బయటపడకపోవడం, బయటపడినా గుర్తించకపోవడం వల్లనే చివరి దశల్లో ఎక్కువ మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. కాబట్టి మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారినపడకుండా మగవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పరీక్షలే పరిష్కారం
పురుషుల్లో.. కడుపులో జననాంగాలకు సమీపంలో నొప్పి కలిగితే ఇతర నొప్పి అనుకుని వదిలేస్తుంటారు. కొంతమంది ఆ నొప్పి గురించి అవగాహన లేక, ఉన్నా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అదే తగ్గిపోతుందిలే అనే భావనతో ఉంటారు. కొన్నాళ్ల తర్వాత సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదిస్తారు. ఇలాంటి సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రొస్టేట్ క్యాన్సర్‌ని గుర్తించే ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ) రక్త పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష క్యాన్సర్‌ని నిర్ధారించలేదు. కాబట్టి ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ స్థాయిని బట్టి తర్వాత ఎం.ఆర్.ఐ., బయాప్సీ పరీక్షలు కూడా చేయించుకోవాలి. సాధారణంగా 50 ఏళ్లు దాటిన పురుషులు ఏడాదికి ఒకసారి ప్రొస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ రక్తపరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష ద్వారా ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు. ఒకవేళ తండ్రి, తల్లి వైపు రక్తసంబంధీకుల్లో ఎవరైనా ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడితే 40 ఏళ్ల వయసు నుంచే ఏడాదికి ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి.
పుట్టుమచ్చలతో పొంచి ఉన్న ముప్పు
స్త్రీ, పురుషుల్లో చర్మంపై ఏర్పడే పుట్టుమచ్చలు కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్లకు దారితీయొచ్చు. అందుకని చర్మంపై ఏర్పడే పుట్టుమచ్చలు పరిమాణంలో, ఆకారంలో మార్పులు గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి. చర్మంపై ఉన్న పుట్టుమచ్చలు సాధారణమైనవా లేక క్యాన్సర్ మచ్చలో నిర్ధారించేందుకు ఏబీసీడీఈ పద్ధతిని అనుసరించాలి. ఏబీసీడీఈ పద్ధతి అంటే…
పెద్దపేగు క్యాన్సర్
పెద్దపేగులో తొలుత చిన్న గుల్లలు ఏర్పడి, అవి క్రమంగా క్యాన్సర్ కణుతులుగా మార్పుచెందే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు తరచుగా ఎదుర్కొంటుంటే పెద్దపేగు క్యాన్సర్‌గా అనుమానించాలి. ఆలస్యం చేయకుండా వైద్యులతో నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
వీరు అప్రమత్తంగా ఉండాలి
ఓరల్ క్యాన్సర్
భారత దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెరుగుతున్న క్యాన్సర్ కేసుల్లో నోటి (ఓరల్) క్యాన్సర్లు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ రోగుల్లోనూ పురుషులే అధికంగా ఉన్నారు. అందుకని ప్రతి వ్యక్తికీ నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ ఎంతో అవసరం. సాధారణంగా నోటిలో కలిగే ప్రాథమిక మార్పుల వల్ల కూడా ఈ రుగ్మతను ఆరంభ దశలో గుర్తించవచ్చు. పొగాకు ఉత్పత్తులు తినడం, పొగతాగడం, మద్యపానం తదితర కారణాల వల్ల ఈ నోటి క్యాన్సర్ వస్తుంది.
చికిత్సా పద్ధతులు
క్యాన్సర్ సోకిన భాగం, వ్యాధి ఉన్న దశ, రోగి వయసు, మెడికల్ హిస్టరీ ఆధారంగా చికిత్సా పద్ధతులు ఆధారపడి ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీతోపాటు కొన్నిరకాల సమ్మేళన థెరపీలను కూడా అవసరానికి అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే స్టేజ్-1, స్టేజ్-2లో కూడా కేవలం సర్జరీతోనే వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు. సర్జరీ తర్వాత పునర్నిర్మాణ శస్త్రచికిత్స అవసరం ఎక్కువగా ఉంటుంది.
స్టేజ్-3, 4లో ఉన్న రోగులకు కీమో, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 డీసీఆర్టీ, వీఎంఏటీ, ఐజీఆర్టీ, ఐజీకేటీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీలాంటి ఆధునిక పద్ధతులతో రేడియోథెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. సాధారణంగా ఈ క్యాన్సర్లకు కీమో థెరపీ పాత్ర తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో కీమోను మిశ్రమ చికిత్సగా అందిస్తారు.ఉపశమనం కోసం పాలియేటివ్ కేర్నూ ఉపయోగించాల్సి వస్తుంది.
నోటి క్యాన్సర్ హెచ్చరికలు..
డాక్టర్ చింతమడక సాయిరామ్
క్లినికల్ ఆంకాల జిస్ట్ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్
-మహేశ్వర్‌రావు బండారి