చర్మం మీద పులిపిరి లేదంటే ఎండిపోయిన పొలుసు లాంటి అతుకులు ఒకట్రెండు నెలల కంటే ఎక్కువ కాలంపాటు ఉంటే వైద్యుణ్ని కలవాల్సిందే. పులిపిరిలా కనిపించేది నిజానికి పొలుసులతో ఉన్న కణాల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఇక ఎండిపోయిన పొలుసు లాంటి అతుకులు కనిపిస్తున్నాయంటే అది కూడా క్యాన్సర్‌కు లేదంటే, యాక్టినిక్ కెరాటోసెస్ అనే క్యాన్సర్‌కు ముందు లక్షణంగా పరిగణించాలి.
ఎలాంటి చర్మ క్యాన్సర్‌నైనా సరే తొలిదశలోనే నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. అలా చేస్తేనే దాని వ్యాప్తిని అరికట్టగలం. తొలిదశలో గుర్తించడం వల్ల చిన్న క్యాన్సర్లకు సర్జరీ చేయడం తక్కువ ప్రయాసతో, సంక్లిష్టం కాకుండా ఉంటుంది. ఇక ప్రీక్యాన్సర్లను క్రీములు, లిక్విడ్ నైట్రోజెన్, ఫొటో డైనమిక్ థెరపీని ఉపయోగించి అవి క్యాన్సర్లుగా పరిణమించకుండా నివారించవచ్చు.
కాగా, గోరు కింద నల్లటిమచ్చలు, రక్తం స్రవించే కురుపు లేదా ఎంతకూ తగ్గని కురుపు (సోర్), అరచేతులు, పాదాల మీద కనిపించే గోధుమ రంగు మచ్చలు లాంటివాటిని క్యాన్సర్‌కు సంకేతాలుగా భావించకూడదు. వాటిని పట్టించుకోక పోయినా ఏమీ కాదు. ఎవరిని కలవాలి?: ఇలాంటి సమస్యలకు డెర్మటాలజిస్టును కలవాలి.
పరీక్షలు: చర్మానికి బయాప్సీ చేసి, వ్యాధి నిర్ధారణ చేస్తారు.