Masoor Dal | మనకు తినేందుకు అనేక రకాల పప్పు దినుసులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మైసూర్ పప్పు కూడా ఒకటి. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. కందిపప్పులాగే ఉంటాయి. వీటినే మసూర్ దాల్ అని కూడా అంటారు. అయితే ఈ పప్పును కూడా చాలా మంది తరచూ తింటుంటారు. ఈ పప్పును తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. భారతీయులు చాలా మంది ఈ పప్పును తరచూ తింటుంటారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వారంలో కనీసం 2 సార్లు ఈ పప్పును తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ పప్పును తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ పప్పులో వృక్ష సంబంధ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. కండరాల నిర్మాణానికి చక్కగా పనిచేస్తాయి. కండరాలను మరమ్మత్తు చేస్తాయి. దీంతో రోజంతా శక్తివంతంగా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటూ చురుగ్గా పనిచేస్తారు. అలసట, నీరసం అన్నవి దరి చేరవు. మైసూర్ పప్పులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఈ పప్పులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్ఉవగా ఉంటాయి. అందువల్ల ఈ పప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కుగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారికి లేదా బరువు నియంత్రణలో ఉండాలని అనుకునే వారికి ఈ పప్పు ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల బరువును చక్కగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మైసూర్ పప్పులో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
మైసూర్ పప్పులో మన శరీరానికి ఎంతో అవసరం అయిన ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బీపీని నియంత్రిస్తాయి. దీంతో హృదయ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మన శరీరానికి ఎల్లప్పుడూ శక్తి కావాలంటే అందుకు ఐరన్ ఎంతగానో అవసరం అవుతుంది. దీని వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. అయితే మైసూర్ పప్పులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మహిళలు, చిన్నారులకు ఎంతగానో మేలు చేస్తుంది. కనుక వీరు తరచూ మైసూర్ పప్పును తినాలి. దీంతో రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇలా మైసూర్ పప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.