Dhavanam Plant | దవనం మొక్క గురించి అందరికీ తెలిసిందే. దీన్ని చాలా మంది తమ ఇంటి పెరట్లో పెంచుతారు. ఈ మొక్క ఆకులను పువ్వుల దండల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దవనం ఆకులు అద్భుతమైన సువాసనను అందిస్తాయి. అందుకనే ఈ మొక్క ఆకులను పూల దండల్లో వాడుతుంటారు. అయితే దవనం మొక్క ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను ఆయుర్వేద, యునాని వైద్య విధానంలో పలు ఔషధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇక దవనం ఆకుల నుంచి ప్రత్యేకంగా నూనెను తయారు చేస్తారు. ఇది అద్భుతమైన సువాసనను అందిస్తుంది. ఈ నూనె వాడితో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దవనం నూనె వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దవనం మొక్క అనేక ఔషధగుణాలను కలిగి ఉంటుంది. దీన్ని ఆధ్యాత్మిక పరంగా కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం, యునాని వైద్యంలోనూ దవనం మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క ఆకుల నుంచి తీసి నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దవనం నూనెను సవాసన కోసం ఉపయోగిస్తారు. ఈ నూనెను వాసన పీలుస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట ఈ మొక్క ఆకుల వాసన లేదా నూనె వాసనను పీలిస్తే మైండ్ రిలాక్స్ అయి చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర సమస్యలను తగ్గించడంలో దవనం నూనె లేదా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
శరీరంపై వచ్చే దురదలు, దద్దుర్లను తగ్గించడంలోనూ దవనం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. సమస్య చోట ఈ నూనెను రాస్తుంటే ఫలితం ఉంటుంది. దీంతో ఎలాంటి చర్మ సమస్యను అయినా సరే తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు తగ్గిపోతాయి. గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. మహిళలు ప్రసవం అనంతరం తమ పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్క్‌లను తగ్గించుకునేందుకు కూడా దవనం నూనె పనిచేస్తుంది. దీన్ని పొట్ట భాగంపై రోజూ మర్దనా చేస్తుంటే ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా సరే తగ్గిపోతాయి. మహిళలు ఈ నూనెను తరచూ వాడుతుంటే నెలసరి సరిగ్గా వస్తుంది. హార్మోన్ల సమస్యలు ఉండవు. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే కూడా ఈ నూనెను పొట్టపై మర్దనా చేయవచ్చు.
రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు కూడా దవనం నూనె పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇచ్చే మందుల్లో ఈ నూనెను కలిపి వాడుతారు. దీంతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దనం నూనె వల్ల కండరాల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెతో శరీరాన్ని మర్దనా చేయడం వల్ల అలసట, నీరసం తగ్గి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. వేడి నీటిలో కాస్త దవనం నూనె చుక్కలను వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం పోతుంది. దీంతో దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇలా దవనం మొక్క ఆకులు లేదా నూనె మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.