Fennel Seeds and Lose weight | సోంపుతో బరువు తగ్గడం సాధ్యమేనా..? ఎలా తీసుకోవాలి..?
Fennel Seeds and Lose weight | శరీరం బరువు తగ్గించుకోవాలని అనుకునే వారికి సోంపు గింజలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అయితే, సోంపును ఎలా తీసుకోవాలనే దానిపై చాలా మంది సందేహాలున్నాయి.
Fennel Seeds and Lose weight | మనలో చాలా మందికి భోజనం చేయగానే నోట్లో వక్కపోడిగానీ, సోంపు గింజలుగానీ వేసుకోవడం అలవాటు. సోంపు గింజలను మౌత్ ఫ్రెషనర్‌గా కూడా వాడుతుంటారు. సోంపును కూరల్లో, స్వీట్ల తయారీలో కూడా వాడుతుంటారు. వక్కపొడి అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు కానీ, సోంపు గింజలు నమలడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. సోంపులో కాల్సియం, మెగ్నిషియం, ఫాస్పరస్, పొటాషియం, ఏ, సీ విటమిన్లు వంటి పోషక విలువలు లభిస్తాయి. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
సోంపును నిత్యం తినడం ద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఈ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా శరీరం బరువు తగ్గడాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇవి శరీరంలోని విషాలను విడుదల చేయడానికి, కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. సోంపు గింజల్లో కెంప్ఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండి శరీరంలోని విషతుల్యాలను తొలగించి అధిక బరువు నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఫన్నెల్ టీ
సోపు గింజలను తినడానికి అయిష్టంగా ఉంటే ఫెన్నెల్ టీ తాగడం ఉత్తమమైన మార్గం. బరువును తగ్గించుకోవాలనుకునే వారు కొన్ని కోరికలను తగ్గించుకోవాలి. ఆకలిగా అనిపించినప్పుడు కప్పు ఫెన్నెల్ టీ తాగండం అలవాటు చేసుకోవాలి. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతుంది. ఒక చిటికెడు సోపు గింజలను నీటిలో వేసి మరిగించి ఫన్నెల్ టీ సిద్ధం చేసుకోవచ్చు. మరింత రుచికరంగా చేసుకోవడానికి దీనికి బెల్లం కలుపుకోవచ్చు.
ఖాళీ కడుపుతో తినడం
మంచి జీవక్రియలు ప్రారంభించేందుకు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వినే ఉంటాం. ఈ నీళ్లలో నిమ్మరసం కలుపుకుంటే మరింత గ్రేట్‌గా మారుతుంది. అదేవిధంగా, ఉదయం పూట సోంపును నీటితో కలిపి తీసుకుంటే శరీరం బరువు తగ్గడానికి గ్రేట్‌గా సాయపడుతుంది. సోంపు తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాలు విడుదలై పలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అదనంగా బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
నానబెట్టిన ఫన్నెల్ గింజల నీరు
అర టీ స్పూన్ ఫన్నెల్ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాతంత్రా నానబెట్టాలి. ఉదయం వేళ ఈ నీటిని తాగాలి. ఫన్నెల్ గింజల్లో ఉండే పోషకాలు ఐదు నుంచి ఆరు గంటల వ్యవధిలో నీటిలోకి విడుదలవుతాయి. ఈ నీటిని తాగగానే అన్ని పోషకాలు శరీరంలోకి చేరి ఆకలి కాకుండా చేస్తాయి.
ఫన్నెల్ సీడ్స్ పౌడర్
సోంపు గింజలను రుబ్బుకుని నీటితో కలుపుకుని తాగవచ్చు. పండ్ల సందుల్లో ఇరక్కుంటుందని చాలా మంది బాధపడుతుంటారు. అందుకని సోంపును పౌడర్ మాదిరిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగుతుండాలి. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీకి చక్కని పరిష్కారం.
రోస్టెడ్ ఫన్నెల్ సీడ్స్
తీపి వస్తువులతో కలిపి తినకుండా చూసుకునేందుకు వీటని కాస్తా రోస్ట్ చేయాలి. ఇలా వేయించిన గింజలకు బ్రౌన్ షుగర్‌గానీ, బెల్లం పొడిని గానీ కలిపి తీసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

