పంచదార మన ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అదేమీ పట్టించుకోకుండా టీ, కాఫీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ పేరుతో ఏదో ఓ రూపంలో తినేస్తుంటారు. అతిగా తీసుకుంటూ బరువుతో పాటు షుగర్ లెవల్స్ పెంచుకుంటూ చాలామంది అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే చక్కెరను కనీసం 14 రోజులు పూర్తిగా మానేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.
తినే పదార్థాల్లో చెక్కర వేసుకోవడం వల్ల కేవలం కేలరీలు మాత్రమే పెరుగుతాయనుకుంటారు. అది మాత్రమే కాదు ఆకలి, క్రేవింగ్స్, ఇన్సులిన్, లివర్ ఫ్యాట్ లాంటి ఎన్నో సమస్యలు మెల్లగా అంటుకుంటాయి. అయితే, చక్కెరకు దూరంగా ఉండటం చెప్పినంత తేలిక కాదు. షుగర్ మానేయగానే ముందుగా క్రేవింగ్స్ పుడతాయి. దీంతోపాటు తలవొప్పి, అలసట, ఇరిటేషన్, మెదడు పనితీరు తగ్గడం వంటి సమస్యలూ పలకరిస్తాయి. ఎప్పుడెప్పుడు చక్కెరను నోట్లో వేసుకుందామా అనిపిస్తుంటుంది.
అయితే, కాస్త ఓపిక పడితే చక్కెరను దూరం పెట్టమని మన శరీరానికి మెదడు చెబుతుంది. అలా ఓ 14 రోజులు చక్కెరకు పూర్తి దూరం పాటిస్తే… బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇంప్రూవ్ అవుతుంది. మెటబాలిజంలో మార్పు వస్తుంది. లివర్ షుగర్ తగ్గుతుంది. చక్కెర మానేయడం పెద్ద కష్టమేమీ కాదు. రోజంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పండ్లు పుషలంగా తినొచ్చు. ఆహారం తీసుకోవచ్చు. చక్కెర, చెక్కరతో చేసిన పదార్థాలకు మాత్రం దూరం పాటిస్తే సరి. ఈ పద్నాలుగు రోజులు సాఫ్ట్డ్రింక్స్, జ్యూస్లు, స్వీటెన్డ్ ఆల్కహాల్ లాంటి వాటిని తీసుకోవద్దు. ఒకసారి ప్రయత్నించి చూడండి.