Hernia | వైద్యరంగంలో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి.దీంతో పలురకాల వ్యాధులను పూర్తి స్థాయిలో అరికట్ట గలుగుతున్నాం. రోగి త్వరగా కోలుకుంటున్నాడు. నొప్పి నుంచి ఉపశమనమూ పొందుతున్నాడు. అంతేకాదు, వ్యాధి పునరావృతం కాకుండా ఉంటున్నది. చికిత్సా విధానాలే కాదు.. శస్త్రచికిత్స పద్ధతుల్లోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానం.. ల్యాపరోస్కోపిక్ సర్జరీ ( Laparoscopic Surgery ).
వైద్య నిపుణులు ల్యాపరోస్కోపిక్ సాంకేతికతను అన్నిరకాల శస్త్రచికిత్సల్లో వాడుతున్నా.. ప్రత్యేకించి కొన్ని వ్యాధుల విషయంలో అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. హెర్నియా. ఇదొక సర్జికల్ డిసీజ్. శస్త్రచికిత్స చేయాల్సిందే. కోత తప్పదు. మందులు పెద్దగా ప్రభావం చూపలేవు. ఈ సమస్య ఉన్నవారికి భరించరానంత నొప్పి ఉంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ప్రాణాల మీదికి రావచ్చు. సాధారణంగా హెర్నియా వ్యాధికి ఓపెన్ సర్జరీ చేస్తారు. దీనివల్ల కుట్లు వేయాల్సి వస్తుంది. నొప్పి అధికంగా ఉంటుంది.
రోగి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. వారాల తరబడి దవాఖానలో ఉండక తప్పదు. వ్యాధి పునరావృతమయ్యే అవకాశాలు మరీ ఎక్కువ. అదే ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో అయితే.. కోతకు అడ్డుకట్ట వేయవచ్చు. వ్యాధి మళ్లీ మళ్లీ రాకుండా అడ్డుకోవచ్చు. అసలు, హెర్నియా ఎందుకు వస్తుంది ? ఎన్ని రకాలుగా ఉంటుంది? ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో ఎలా నయం చేయవచ్చు? ఓపెన్ సర్జరీకి, ల్యాపరోస్కోపిక్ సర్జరీకి తేడా ఏమిటి ? అంతిమంగా రోగికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. సాధారణ ప్రజల్లో ఎన్నో సందేహాలు, దాంతోపాటే కొన్ని అపోహలు. వాటన్నిటిని తొలగించు కోవాల్సిందే. పేగుల్లో ఏర్పడే లీకేజీల వల్ల ఏర్పడే రుగ్మతే.. హెర్నియా.
ఈ వ్యాధి ప్రధానంగా రెండు సందర్భాలలో వచ్చే అవకాశం ఉంది. ఏదైనా శస్త్రచికిత్స చేయాలంటే చర్మంతో పాటు కండరాలను కూడా కొన్ని సెంటీమీటర్ల మేర కోస్తారు. సర్జరీ తరువాత అక్కడ కుట్లు వేస్తారు. అయితే ఒక్కసారి కోతకు గురైన చర్మం, కండరాలు తమ సహజత్వాన్ని కోల్పోయి బలహీనపడతాయి. ఫలితంగా, కొంతకాలం తరువాత రంధ్రం లేదా పగుళ్లు ఏర్పడతాయి. దీంతో ఆ మార్గంలోంచి పేగులు బయటికి వచ్చే ప్రమాదం ఉంది. దీన్నే ‘ఇన్సిషనల్ హెర్నియా’ అంటారు.
ప్రధాన కారణాలు
మహిళల్లోనే ఎక్కువ
పురుషులతో పోలిస్తే.. ఇన్సిషనల్ హెర్నియా మహిళలనే ఎక్కువగా బాధిస్తుంది. సాధారణంగా శరీరంపై పడే ప్రతి కోతకూ హెర్నియా వచ్చే అవకాశాలు 10 శాతం వరకూ ఉంటాయి. అందులోనూ మహిళలు సిజేరియన్, ట్యూబెక్టమీ వంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు, సర్జరీ జరిగిన ప్రదేశంలో చర్మంతో పాటు లోపలి కండరాలు కూడా బలహీనపడతాయి. దీంతో మొదటిసారి సిజేరియన్ జరిగిన వారిలో హెర్నియా ముప్పు తక్కువగా ఉంటుంది. అదే రెండుసార్లు జరిగితే హెర్నియా అవకాశాలు 10 నుంచి 20 శాతం పెరుగుతాయి. మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు సిజేరియన్ జరిగితే మాత్రం నూటికి నూరుశాతం హెర్నియా రావచ్చు.
సున్నిత భాగాల నుంచి
మనిషికి పుట్టుకతోనే కొన్ని భాగాలు చాలా సున్నితంగా, మరీ బలహీనంగా ఉంటాయి. ప్రధానంగా నాభి, వృషణాలు మరింత సుకుమారం. ఈ భాగాల్లో కండరాలు సైతం అంతే బలహీనంగా ఉంటాయి. నాభి వద్ద అయితే.. కండరాలు, వాటి వెనక పేగులు మాత్రమే ఉంటాయి. తగినంత సత్తువ లేకపోవడం వల్ల కొందరి కండరాలకు పగుళ్లు ఏర్పడి లీకేజీ మొదలవుతుంది. ఇలా వచ్చేదే ‘అంబ్లికల్ హెర్నియా’. ఇది స్త్రీ, పురుషులు ఎవరికైనా రావచ్చు. ఇక పురుషుల్లో వృషణాల కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి. దీంతో అక్కడ పేగులకు ఇట్టే లీకేజీ వచ్చేస్తుంది. ఫలితంగా ‘ఇంగ్వైనల్ హెర్నియా’ వస్తుంది. ఇది ఎక్కువగా పురుషుల గజ్జ్జల్లో ఉత్పన్నం అయ్యే సమస్య.
వ్యాధి లక్షణాలు
వైద్య పరీక్షలు
పొత్తికడుపులో కానీ, గజ్జ్జ్జలలో కానీ నొప్పిగా ఉన్నా, గడ్డలా కనిపించినా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రా సోనోగ్రఫీ, సీటీ స్కాన్ ద్వారా హెర్నియాను గుర్తించవచ్చు. ఒక్కసారి నిర్ధారణ జరిగిన తరువాత, వ్యాధి మూలాలను తెలుసుకోవడం ముఖ్యం. ఆ నిర్ధారణ ఆధారంగానే ప్రధాన చికిత్స మొదలవుతుంది.
ఈ రెండూ..
ఇవీ జాగ్రత్తలు
‘ఓపెన్ సర్జరీ’ అయితే..
ఓపెన్ సర్జరీ చేయించుకున్న వారిలో హెర్నియా మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఐదు శాతం ఎక్కువ. ఈ పద్ధతిలో హెర్నియా ప్రభావిత భాగంలో సుమారు 15-20 సెంటీమీటర్ల మేర కోత పెడతారు. అనంతరం పగుళ్ల నుంచి బయటికి వచ్చిన పేగులను లోపలికి పంపి, ఆ రంధ్రాన్ని మూసేస్తారు. పరిస్థితిని బట్టి కండరాలకు కుట్లు వేస్తారు. అనంతరం కండరాలపై మెష్ పెడతారు. ఈ సర్జరీకి కనీసం 3 గంటల సమయం పడుతుంది. శస్త్రచికిత్స తరువాత రోగి అథమ పక్షం ఐదు రోజులు దవాఖానలో ఉండాల్సి ఉంటుంది. సర్జరీ జరిగిన ప్రదేశంలో నొప్పి కారణంగా.. కోలుకునేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. కుట్లు విప్పడానికి రెండు వారాలు పట్టవచ్చు. కోలుకున్న తరువాత కూడా రోగి పూర్తిస్థాయి సాధారణ జీవనాన్ని గడపలేడు.
పెద్దపెద్ద బరువులు లేపకూడదు. ఇండియన్ టాయిలెట్స్ వాడకూడదు. అంతస్తులకు అంతస్తులు మెట్లు ఎక్కకూడదు. విశ్రాంతి చాలా అవసరం. అదే ల్యాపరోస్కోపిక్ పద్ధతితో ఇలాంటి పరిమితులు ఉండవు. శరీరానికి మూడు చిన్నపాటి రంధ్రాలు చేస్తారు. ఒక్కో రంధ్రం 0.5 సెం.మీ మాత్రమే ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా ల్యాపరోస్కోపి యంత్రాన్ని పంపించి.. కండరాల నుంచి బయటికి వచ్చిన పేగులను లోపలికి పంపుతారు. అనంతరం పగుళ్లు, రంధ్రాలకు కుట్లు వేస్తారు. కండరాలపై మెష్ పెడతారు. శస్త్రచికిత్స తరువాత ఆ మూడు రంధ్రాలకు ఓపెన్ సర్జరీలో మాదిరిగా కుట్లు వేయకుండా.. చిన్నపాటి పిన్నులు వేస్తారు. వారం రోజుల తరువాత వాటిని తొలగిస్తారు. కొద్దిరోజుల్లోనే రోగి సాధారణ జీవితం గడపవచ్చు.
ల్యాపరోస్కోపిక్ లాభాలు..
డాక్టర్ బి.నాగేందర్(జనరల్ సర్జన్)
సూపరింటెండెంట్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్
…?మహేశ్వర్రావు బండారి