Apps:
Follow us on:

Guava Helath Benefits | జామకాయ తింటే బరువు తగ్గుతారా?

1/6ఎరుపు, తెలుపు రంగు గుజ్జుతో ఉండే జామను ఇష్టపడని వారు ఉండరు. వగరు, పులుపుతో కూడిన తియ్యని రుచి కలిగిన జామ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. పెరటి చెట్టుగా భావించే జామలో అనేక పోషకాలున్నాయి.
2/6జామ పండ్లలో పీచు, విటమిన్- ఎ, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లాల శాతం చాలా ఎక్కువ. పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కమలాపండులో దొరికే సి విటమిన్‌తో పోలిస్తే ఓ జామ పండులో దొరికే సి విటమిన్ శాతం నాలుగు రెట్లు ఎక్కువ.
3/6డయేరియా, డీసెంట్రీ, గ్యాస్ట్రోంటరైటస్ వంటి వ్యాధుల్ని అరికట్టే గుణం జామకాయలు, పండ్లలో ఉంది. మలబద్దక సమస్య ఉన్న వారికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి.
4/6బరువు తగ్గడానికి జామ దోహదపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాంతో పొట్ట త్వరగా నిండిపోతుంది. ఆకలి వేయడానికి సమయం పడుతుంది. రోజూ ఓ దోర జామ పండు తింటే డయాబెటిస్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు.
5/6బాగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామ ఆకుల డికాక్షన్ తాగితే త్వరగా తగ్గుతుంది. జామకాయలు, ఆకుల్లో ఉండే యాస్ట్రింజెంట్లు చర్మానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
6/6పచ్చి జామకాయల జ్యూస్‌ను ఒంటికి పట్టిస్తే చర్మం శుభ్రపడి కాంతివంతమవుతుంది. పైగా వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి. వీటిలో ఉండే పీచు కారణంగా కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి.