శరీరంలో అతి ముఖ్యమైన సున్నితమైన భాగం కన్ను. మనకు దారి చూపే కంటిపై గ్లకోమా అనే వ్యాధి చడీచప్పుడు లేకుండా ‘కంటి దొంగ’లా చూపును దోచేస్తుంది. దీన్నే మనవాళ్లు నీటి కాసుల సమస్య అని కూడా అంటుంటారు. ఎలాంటి బాధలు లేకుండా, పైకేమీ అనుమానం రానీయకుండా మన చూపును క్రమంగా తగ్గిస్తుంది. నీటికాసుల వ్యాధిపై అవగాహన కలిగించేందుకు ఏటా మార్చి 12 వ తేదీన ప్రపంచ గ్లకోమా దినం నిర్వహిస్తున్నారు.
గ్లకోమా ప్రారంభమైనపుడు పాక్షికంగా దృష్టిలోపం కలుగుతుంది. దానిని నిర్లక్ష్యం చేసి, సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నాళ్లకు పూర్తిగా కంటిచూపు పోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారికైనా గ్లకోమా రావచ్చు. కొందరు పిల్లల్లో ఇది పుట్టుకతోనే ఉంటుంది. అనువంశికంగా కూడా వస్తుంది. హ్రస్వదృష్టి ఉండేవారిలో గ్లకోమా రావచ్చు. ముఖానికి స్టెరాయిడ్ పూత మందులు రాసుకునే వారిలో కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
లక్షణాలు కనిపించవు..
ప్రారంభంలో గ్లకోమాకు ఎటువంటి భయపెట్టే లక్షణాలూ కనిపించవు. ఈ వ్యాధికి తొలి లక్షణం పక్కచూపు మందగించడం. అయితే దీన్ని గుర్తించేసరికే వ్యాధి తీవ్రమైపోతుంది. కంటి నరాల్లో ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు హఠాత్తుగా కన్నునొప్పి రావడం, తలనొప్పి రావడం, చూపు మసకబారడం, కాంతి చుట్టూ వలయాలుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంట్లో అసౌకర్యం కలగకపోవడం వంటి కారణాల వల్ల గ్లకోమాను చివరి దశ వరకూ గుర్తించలేరు. కొంచెం అప్రమత్తతతో కళ్లను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ గ్లకోమాను తొలి దశలోనే కనిపెట్టే ప్రయత్నం చేయాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..