న్యూఢిల్లీ : అజీర్తి, మలబద్ధకం, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతుంటారు. ఆహారంలో (Health Tips) మార్పుల ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకుని ఎన్నో జీవనశైలి వ్యాధులనూ దరిచేరకుండా చూసుకోవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు అధికంగా తీసుకోవడం ద్వారా మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలనూ అధిగమించవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్ వంటి ఆహార పదార్ధాల్లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. పీచు పదార్ధాలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడమే కాకుండా బరువు నియంత్రణతో పాటు మధుమేహ నియంత్రణ, హృద్రోగ ముప్పు నివారణకూ ఉపయోగకరం.
ఇక ఓట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేయడం ద్వారా రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించవచ్చు. విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు వీటిలో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఆపై ప్రేవుల ఆరోగ్యం మెరుగయ్యేందుకు ఓట్స్ మేలు చేస్తాయి. ఫైబర్‌తో కూడిన ఈ ఆహార పదార్దాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..
ఓట్స్
డ్రైఫ్రూట్స్
పప్పుధాన్యాలు
యాపిల్
స్వీట్ పొటాటో
Read More :
Leo Movie | తొలిరోజే వంద కోట్లు.. సంచలనం సృష్టించిన లియో సినిమా..!