Jujube Fruit | చలికాలం మొదలైందంటే చాలు మనకు రేగు పండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రహదారుల పక్కన బండ్లపై రేగు పండ్లను ఎక్కువగా విక్రయిస్తుంటారు. వీటినే జుజుబి పండ్లని కూడా అంటారు. ఈ పండ్లు కాయలుగా ఉన్నప్పుడు వగరుగా ఉంటాయి. అదే పండితో మాత్రం తియ్యగా ఎంతో రుచిగా ఉంటాయి. ఈ చెట్లు 5 నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. వీటినే ఇండియన్ డేట్స్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను ఈ సీజన్లో తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. రేగు పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక సీజనల్‌గా లభించే రేగు పండ్లను తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లను తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ప్రోటీన్లు కూడా వీటిల్లో సమృద్ధిగానే ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో సహాయం చేస్తాయి.
రేగు పండ్లను తినడం వల్ల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. పైగా వీటిల్లో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. అలాగే షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి రేగు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్‌ను నియంత్రించుకునేందుకు దోహదపడతాయి. రేగు పండ్లను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండ్లలో న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఆందోళన, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది.
రేగు పండ్లలో ఉండే యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్తేజంగా ఉంటారు. ఈ పండ్లలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్త నాళాలను వెడల్పుగా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. రేగు పండ్లలో బీటులినిక్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
రేగు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది బీటులినిక్ యాసిడ్‌కు సహాయం చేస్తుంది. దీంతో శరీరంలో గ్లూటాథియోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. రేగు పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తీవ్రమైన మలబద్దకాన్ని సైతం తగ్గిస్తుంది. దీంతో రోజూ సుఖ విరేచనం అవుతుంది. అలాగే రేగు పండ్లను మరీ అధికంగా తింటే మాత్రం వేడి చేస్తుంది. అలాగే విరేచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే మంచిది. ఇక ఈ పండ్లను తినడం వల్ల బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ లభిస్తుంది. ఇది దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. రేగు పండ్లలో యాంటీ అల్లెర్జిక్ గుణాలు ఉంటాయి. ఈ పండ్లను తింటే అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ హిస్టామైన్ గా పనిచేస్తుంది. కనుక అన్ని రకాల అలర్జీలు తగ్గుతాయి. ఇలా రేగు పండ్లను తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సీజన్లో వీటిని మిస్ చేసుకోకుండా తినండి.