Ivy Gourd Benefits | రోజూ మనం భిన్న రకాల కూరలను వండుకుని తింటుంటాం. వారం రోజుల్లో చాలా మంది దాదాపుగా రోజూ ఒకే కూర చేయరు. భిన్న రకాల కూరలను వండి తింటుంటారు. అయితే మనం తినే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. వీటితో చాలా మంది పకోడీ లేదా ఫ్రై, టమాటా కర్రీ, పచ్చడి చేస్తుంటారు. ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే దొండకాయలతో జ్యూస్ చేసి రోజూ తాగవచ్చు. దీన్ని రోజూ ఒక కప్పు మోతాదులో తాగినా చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. దొండకాయల జ్యూస్‌ను తాగడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయని అంటున్నారు.
దొండకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దొండకాయల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. దొండకాయలను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటితో కలిగే లాభాల గురించి తెలిస్తే అసలు విడిచిపెట్టరు. దొండకాయలను చాలా మంది తరచూ తింటూనే ఉంటారు. కానీ వీటితో కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియవు.
దొండకాయల్లో ముఖ్యంగా విటమిన్లు సి, కెలతోపాటు క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ కాయల జ్యూస్‌ను రోజూ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
దొండకాయల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. దొండకాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ కాయలతో చేసే జ్యూస్‌ను తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగి పోతుంది.
షుగర్ పేషెంట్లకు దొండకాయలు వరమనే చెప్పవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ పరగడుపునే దొండకాయలతో జ్యూస్ తయారు చేసి తాగుతుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. దొండకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. దొండకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను పెరగనీయవు. దీంతో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇలా వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక వీటిని లైట్ తీసుకోకండి. రోజూ వీటి జ్యూస్ తాగండి. ఎన్నో లాభాలను పొందవచ్చు.