Apps:
Follow us on:

Lemon Pickle | నిమ్మకాయ తొక్కు ఆరోగ్యానికి మంచిదేనా?

1/5Lemon Pickle | మన తెలుగు వంటకాల్లో తొక్కులది ప్రత్యేక స్థానం. ఏ కూరతో భోజనం చేసినా మొదటి ముద్ద తొక్కులతో ఉండాల్సిందే. ఇప్పటి పిల్లలు తొక్కులు తినేందుకు ఇష్టపడరు.. కానీ వీటిలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పుల్లపుల్లగా కారం కారం ఉండే నిమ్మకాయ తొక్కు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
2/5ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి. రక్త ప్రవాహంలో హెచ్చుతగ్గులు రక్తపోటుకు కారణమవుతుంటాయి. అయితే రోజూ నిమ్మకాయ తొక్కుతో తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.
3/5నిమ్మకాయ తొక్కులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొవ్వు అస్సలు ఉండదు. హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. కాబట్టి నిరభ్యంతరంగా డైట్‌లో చేర్చుకోవచ్చు.
4/5నిమ్మకాయలో కాపర్‌, పొటాషియం, ఐరన్‌ , కాల్షియం ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఎముకల ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. కాబట్టి కాల్షియం, విటమిన్‌ ఏ, సీ పొటాషియం కలిగిన నిమ్మకాయ తొక్కును ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
5/5స‌ప్లిమెంట్ల ద్వారా విట‌మిన్లు, పోష‌కాల‌ను తీసుకోవ‌డానికి బ‌దులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ తొక్కు ఒకటి. ఇందులో బీ కాంప్లెక్స్‌ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.