Diabetes and coconut water | షుగర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? మంచిదా..? చెడా..?
Diabetes and coconut water | రోడ్డుపై కొబ్బరి బోండాం కనిపించగానే వెంటనే తాగేస్తుంటాం. అయితే, మధుమేహులు మాత్రం తాగాలా, వద్దా? అని అలోచిస్తుంటారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
Diabetes and coconut water | షుగర్ అనేది చాపకింది నీరులా మనల్ని చుట్టేస్తున్నది. ఏం తిన్నా, తినకపోయినా డయాబెటిస్తో ఇబ్బంది ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు ఈ సమస్య కారణంగా జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. తీపి పదార్థాలు తినకుండా చూసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? అనే సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
మనం ఎండలో అలా తిరిగి రాగానే కొబ్బరినీళ్లు తాగాలని అనుకుంటుంటాం. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతుంటాం. ఎలాంటి అరోగ్య సమస్య వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా కొంత ఉపశమనం పొందుతుంటాం. విరోచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు ఎదురైన సందర్భాల్లో కొబ్బరి నీరు తాగడం వల్ల రిలీఫ్ పొందుతాం. కొబ్బరినీళ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తోపాటు తక్కువ మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి. అదేవిధంగా, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, సీ విటమిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
కొబ్బరినీటిని అన్నం భోజనం రుచిని మెరుగుపర్చుకునేందుకు, సలాడ్ తయారు చేసుకోవడానికి, ఐస్క్రీంల తయారీలో వాడుతుంటారు. ఓట్స్‌తో కలిపి తీసుకోవచ్చు. వీటితో రుచికరమైన వేసవి మాక్‌టెయిల్‌ను సర్వ్ చేయవచ్చు. కొబ్బరి నీళ్లతో ఐస్ కాఫీ తయారు చేసుకోవచ్చు. స్మూతీ చేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి నీటితో కూర కూడా చేసుకోవచ్చు.
మధుమేహులు కొబ్బరి నీరు తాగొచ్చా..
కొబ్బరి నీరు తాగడం వలన డయాబెటిస్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కొబ్బరి నీళ్లు తాగడం మధుమేహులకు వరం లాంటిదని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. మధుమేహం కంట్రోల్లో ఉంచడంలో కొబ్బరినీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో తక్కువ మొత్తంలో చక్కర శాతం ఉండటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు.
కొబ్బరినీటిలో సహజంగా ఉండే చక్కెరలు దాని తీపి రుచికి కారణమవుతాయి. అయితే, ప్యాక్ చేసిన కొబ్బరినీటిలో ఎక్కువ షుగర్ ఉంటుంది. 330 ఎంఎల్ కార్టన్‌కు 15 గ్రా. చక్కెర కలిగి ఉంటుంది. అధిక సాంద్రత కలిగిన నీటిలో దాదాపు 4 టేబుల్ స్పూన్ల చక్కెరకు సమానంగా ఉంటుంది. 100 ఎంఎల్ కు 2 గ్రా. కంటే తక్కువ షుగర్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సీ, ఎల్-అర్జినైన్ ఇన్సులిన్‌కు కణాల సున్నితత్వాన్ని పెంచుతాయన వైద్యులు చెప్తున్నారు. అందుకని అనుమానాలు పక్కనపెట్టి కొబ్బరి నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ డయాబెటిస్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే రోజుకు 1-2 కప్పులకు (240-280 ఎంఎల్) పరిమితం చేయాలి.
కొబ్బరి నీటిలో ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ ఉండి మధుమేహులకు ఆకలి కాకుండా చూస్తుంది. మరే ఇతర పానీయాల కన్నా ఎంతో మేలైనది. ఆర్టిపీషియల్ స్వీటనర్ ఉండదు, ప్రిజర్వేటీస్ వాడాల్సిన అవసరం ఉండదు. దీనిలో నాచురల్ ఎలక్ట్రోలైట్స్ మధుమేహులకు ఎంతో శక్తినిస్తాయి. ఎక్కువ మొత్తంలో ఉండే పొటాషియం చాలా మంచిది. అందుకని డయాబెటిస్ పేషెంట్స్ ఎలాంటి అనుమానాలు లేకుండా కొబ్బరి నీరు తాగొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

