Dehydration Symptoms | మీ శరీరం ఈ లక్షణాలను తెలియజేస్తుందా.. అయితే మీరు డీహైడ్రేషన్ బారిన పడ్డారని అర్థం..
రోజూ నీళ్లను ఎక్కువగా తాగాలని అందరికీ తెలుసు. అయినప్పటికీ రోజంతా చాలామంది తెలియకుండానే స్వల్పంగా డీహైడ్రేషన్ (దేహంలో నీరు తగ్గిపోవడం)తో ఉంటారు. ముఖ్యంగా దాహం ఎక్కువగా అనిపించని వారు లేదా పనుల్లో బిజీగా ఉండి నీరు తాగడం మర్చిపోయే వారికి ఇది సాధారణంగా జరుగుతుంది.
Dehydration Symptoms | రోజూ నీళ్లను ఎక్కువగా తాగాలని అందరికీ తెలుసు. అయినప్పటికీ రోజంతా చాలామంది తెలియకుండానే స్వల్పంగా డీహైడ్రేషన్ (దేహంలో నీరు తగ్గిపోవడం)తో ఉంటారు. ముఖ్యంగా దాహం ఎక్కువగా అనిపించని వారు లేదా పనుల్లో బిజీగా ఉండి నీరు తాగడం మర్చిపోయే వారికి ఇది సాధారణంగా జరుగుతుంది. డీహైడ్రేషన్ పెద్దగా కనిపించని సమస్యలా అనిపించినా, ఇది చిన్న చిన్న మార్గాల్లో శరీరంపై ప్రభావం చూపుతుంది. సరైన హైడ్రేషన్ ఉంటే పరిష్కరించగలిగే అనేక సమస్యలకు ఇది కారణమవుతుంది. డీహైడ్రేషన్ కు గురి అయినప్పుడు శరీరం కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌ను సూచించే 5 ముఖ్య లక్షణాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
మూత్రం రంగు, చర్మం స్థితి..
మొదటగా మూత్రం రంగును గమనించడం చాలా ముఖ్యమైన సూచన. సాధారణంగా లైట్ యెల్లో లేదా దాదాపు పారదర్శకంగా ఉంటే శరీరంలో నీరు సరిపడేలా ఉన్నట్లు భావించాలి. అయితే గాఢమైన పసుపు రంగులో ఉంటే అది డీహైడ్రేషన్‌కు సంకేతం. ఎప్పుడూ గాఢంగా ఉంటే శరీరం నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని అర్థం. రెండవది, కారణం లేకుండా తరచూ అలసటగా అనిపించడం కూడా నీటి కొరత వల్ల వస్తుంది. శరీరానికి సరిపడా ద్రవాలు అందకపోతే కణజాలాలు సరిగా పనిచేయవు. దీనివల్ల నీరసం, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి. మూడవ లక్షణంగా చర్మం, పెదవులు, నోరు ఎక్కువగా ఎండిపోవడం కనిపిస్తాయి. ముఖ్యంగా వేసవిలో కూడా చర్మం నిర్జీవంగా, పొడిగా అనిపిస్తే అది శరీరానికి నీరు తక్కువగా ఉందనే సంకేతం. నాలుగవది తరచూ తలనొప్పి రావడం. డీహైడ్రేషన్ వల్ల మెదడులోని ద్రవ సమతుల్యత కొంతమేరకు దెబ్బతింటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. అటువంటి సమయంలో వెంటనే మందులు తీసుకోవడం కంటే ముందుగా నీరు తాగడం మంచిది. ఐదవ లక్షణం తరచూ ఆకలి వేయడం. చాలా సందర్భాల్లో శరీరం దాహం, ఆకలిని వేరు చేయలేకపోతుంది. అందుకే త్వరగా ఆకలి వేస్తే, ముందుగా ఒక గ్లాస్ నీరు తాగి చూడటం ఉత్తమం.
కొద్ది కొద్దిగా ఎక్కువగా తాగాలి..
ఇక 5 సులభమైన మార్గాలను ఉపయోగించి శరీరాన్ని సులభంగా హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. రోజంతా నీరు తాగడంలో తొందరపడకూడదు. ఒకేసారి ఎక్కువగా తాగడం కంటే కొద్దికొద్దిగా తరచూ తాగడం మంచిది. ఇది శరీరానికి నీరు సరిగా అందేలా చేస్తుంది. అలాగే ప్రతిరోజూ ఉదయం లేవగానే టీ లేదా కాఫీకి ముందుగా ఒక గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా నిద్ర తర్వాత శరీరం స్వల్పంగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ అలవాటు శరీరానికి శక్తిని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే విధంగా ఆహారంలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చడం మంచిది. పుచ్చకాయ, దోసకాయ, నారింజ పండ్లు, టమటాలు వంటి వాటి ద్వారా శరీరానికి సహజంగా నీరు అందుతుంది.
ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరమే..
అలాగే ఎక్కువగా చెమట పట్టే పరిస్థితుల్లో కేవలం నీరు మాత్రమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం అవుతాయి. ఇందుకోసం ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు, ఆరు టీ స్పూన్ల చక్కెర కలిపి ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, నీరు తాగడం మర్చిపోకుండా ఉండటం. పనుల్లో బిజీగా ఉండటం వల్ల చాలా మంది నీరు తాగడం మర్చిపోతారు. అందుకే దగ్గరలో నీటి బాటిల్ ఉంచుకోవడం లేదా ఫోన్లో రిమైండర్లు పెట్టుకోవడం మంచిది. డీహైడ్రేషన్ చిన్న సమస్యగా కనిపించినా, దీని ప్రభావం శరీరంపై చాలా ఉంటుంది. అలసట, తలనొప్పి, చర్మ సమస్యలు వంటి అనేక ఇబ్బందులకు ఇది కారణమవుతుంది. అయితే దీనికి పరిష్కారం చాలా సులభం. సరిపడా నీరు తాగితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

