Rusks | చాలా మంది టీ లేదా కాఫీ తాగేటప్పుడు లేదా తాగడానికి ముందు పలు రకాల స్నాక్స్ తింటుంటారు. వాటిల్లో రస్క్ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఇది చాలా పాపులర్ అయింది. ఇంట్లో లేదా బయట ఎక్కడ టీ, కాఫీ తాగినా స్నాక్స్ లాగా రస్క్‌లను తింటున్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇవి ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రస్క్‌లను తినడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని అంటున్నారు. వీటిని మైదా పిండి, చక్కెర, నూనె, ఈస్ట్, కోడిగుడ్లు, పాల పొడి వంటివి ఉపయోగించి తయారు చేస్తారు. అయితే రస్క్‌లు వాటిని తయారు చేసే విధానం వల్ల వాటిలో వాడే పదార్థాల్లో ఉండే పోషకాలను పూర్తిగా కోల్పోతాయి. ఈ క్రమంలో అలాంటి రస్క్‌లను తింటే తీవ్రమైన నష్టాలు ఉంటాయి.
రస్క్‌లలో మైదా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మైదాలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అసలు ఏమాత్రం ఉండవు. అందువల్ల మైదాతో తయారు చేసే రస్క్‌లను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. డయాబెటిస్ లేని వారికి కూడా రస్క్‌లను తరచూ తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక వీటిని తినడం మానుకోవాలి. రస్క్‌లలో అధిక మొత్తంలో చక్కెర, హైడ్రోజినేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అధికంగా బరువు పెరిగేలా చేస్తాయి. దీంతో బీపీ అధికమవుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రస్క్‌లలో ఫైబర్ అసలే ఉండదు. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను కలగజేస్తుంది. రస్క్‌లలో ప్రోటీన్లు కూడా ఉండవు కనుక వీటిని తింటే రోజు మొత్తంలో ఇతర సమయాల్లో ఆకలి ఎక్కువ అవుతుంది. దీంతో ఆహారం అధికంగా తింటారు. ఇది బరువు పెంచేలా చేస్తుంది. కనుక రస్క్‌లకు దూరంగా ఉంటే మంచిది.
రస్క్‌లను తరచూ తినే వారికి షుగర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఆ లెవల్స్‌ను తగ్గించేందుకు క్లోమగ్రంథి అధికంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తూ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇలాగే జరిగితే క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో షుగర్ లెవల్స్ అధికంగా పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది. అలాగే రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ మరీ అధికంగా ఉంటే ఆహారం కొవ్వుగా మారుతుంది. దీన్ని శరీరం నిల్వ చేసుకుంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గానే ఉన్నా కొవ్వు కారణంగా శరీరం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దీంతో షుగర్ లెవల్స్ అంతకంతకూ పెరిగిపోతాయి. చివరకు డయాబెటిస్‌కు దారి తీస్తుంది. రస్క్‌లను తినడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది కనుక వీటిని తినడం మానేస్తే మంచిది.
రస్క్‌లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. పిండి పదార్థాలు, చక్కెర. కొవ్వులు అధికంగా ఉంటాయి. కనుక తరచూ వీటిని తింటే శరీరంలో చేరే క్యాలరీలు పెరిగిపోతాయి. కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. రస్క్‌లలో ఫైబర్ ఉండని కారణంగా అవి సులభంగా జీర్ణం కావు. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కొందరికి పొట్టలో తరచూ విపరీతమైన అసౌకర్యం ఏర్పడుతుంది. రస్క్‌లను తింటే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం సైతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రస్క్‌లను తినడం వల్ల పోషకాహార లోపం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. కనుక వీటిని తినడం పూర్తిగా మానేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.