ICMR | కొవిడ్ టీకా సింగిల్ డోస్ తర్వాత.. మహమ్మారి బారినపడినా మరణాలు తక్కువ..! వెల్లడించిన ఐసీఎంఆర్ అధ్యయనం..!
ICMR | కరోనా కొత్త రూపాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ముప్పు పెరుగుతున్నది. ఇటీవల రెండు కొత్త వేరియంట్లు ఎరిస్, బీ.ఏ.2.68 వెలుగు చూడడంతో అందరినీ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు.
ICMR | కరోనా కొత్త రూపాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ముప్పు పెరుగుతున్నది. ఇటీవల రెండు కొత్త వేరియంట్లు ఎరిస్, బీ.ఏ.2.68 వెలుగు చూడడంతో అందరినీ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. ఈ వేరియంట్ల ఇన్ఫెక్టివిటీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. టీకాలు తీసుకున్న వారితో పాటు ఇంతకు ముందు కొవిడ్ సోకి కోలుకున్న వారిలోనూ రోగనిరోధక శక్తి ఉన్న వారిలో ప్రమాదం ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్లలోని ఉత్పరివర్తనాలు సులభంగా రోగ నిరోధకశక్తి నుంచి తప్పించుకుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయో తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఓ అధ్యయనం నిర్వహించింది.
కొనసాగుతున్న పరిశోధన నివేదిక ప్రకారం.. కొవిడ్ బారినపడ్డ 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, కొమొర్బిడిటీ బాధితులు, మితమైన, తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో.. వైరస్ నుంచి కోలుకున్న సంవత్సరంలోపు మరణాల రేటు ఎక్కువ ఉన్నది. కరోనా మహమ్మరి శరీరంలో సమస్యలను అభివృద్ధి చేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో ప్రమాదం పెరగడంతో పాటు మరణాన్ని సైతం పెంచుతుందని తెలిపింది. కరోనాకు ముందు వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్న వ్యక్తులు.. డిశ్చార్జి తర్వాత మరణాల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కరోనా అనేక రకాల ఆరోగ్య సమస్యలను పెంచుతుందని అధ్యయనంలో గుర్తించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని పేర్కొంది. పోస్ట్-డిశ్చార్జ్ మరణాల నుంచి 60శాతం రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది.
అధ్యయనంలో భాగంగా కరోనాతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన 14,419 మందిని ఏడాది పాటు పరిశీలించి.. నాలుగువారాలకోసారి ఆర్యోగ్యంపై ఆరా తీశారు. ఏడాది తర్వాత పూర్తి వివరాలతో నివేదికను రూపొందించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వీరిలో 942 మంది మృతి మృతి చెందగా.. 13,477 మంది ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఐసీఎంఆర్ నివేదికను రూపొందించింది. రూపొందించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన కొవిడ్-19 రోగుల వివరాలను ఐసీఎంఆర్ పరిధిలోని నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ సేకరించింది. దేశవ్యాప్తంగా 31 కేంద్రాలు ఉండగా.. అవి సేకరించిన డేటా ఆధారంగానే ఈ అధ్యయనం కొనసాగింది. ‘18 నుంచి 45 ఏళ్లలోపు వయసున్నవారిలో పోస్ట్ డిశ్చార్జ్ మరణాలకు కారణాలపై అవగాహన కోసం ప్రయత్నిస్తున్నామని అధ్యయనం తెలిపింది. ముందే కొవిడ్-19 టీకా తీసుకున్న వారిలో పోస్ట్ డిశ్చార్జ్ మరణం నుంచి రక్షణగా ఉండగా.. అయితే, ఇప్పుడు దీనిపై ఓ నిర్ణయానికి రాలేమని, పేర్కొంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

