Aloe Vera | ఆయుర్వేద ప్రకారం కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కలబంద గుజ్జును తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. చాలా మంది ప్రస్తుతం కలబందను ఇండ్లలోనే పెంచుతున్నారు. దీంతో మనకు కలబంద ఎప్పుడు కావాలంటే అప్పుడు లభిస్తుంది. ఇక మార్కెట్లోనూ కలబంద జ్యూస్‌ను విక్రయిస్తున్నారు. దీన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. అయితే కలబంద నిజంగా మనకు ఆరోగ్య ప్రదాయిని అనే చెప్పవచ్చు. కలబంద జ్యూస్‌ను తాగడం లేదా కలబంద గుజ్జును ఉపయోగించడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందానికి, శిరోజాల సంరక్షణకు కూడా కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు.
కలబంద గుజ్జు లేదా జ్యూస్‌ను నేరుగా అలాగే తీసుకోవచ్చు. అయితే కలబంద రుచి కొందరికి నచ్చకపోవచ్చు. ఇది కొందరికి చేదుగా, వగరుగా అనిపిస్తుంది. కనుక అలాంటి వారు తేనెను చేర్చి తీసుకోవచ్చు. అయితే కలబందను అలర్జీలు ఉన్నవారు తీసుకోకూడదు. కలబందను తింటే కొందరికి పడదు. దీంతో వారికి చర్మంపై దురదలు వస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సమస్యలు ఎదుర్కొనే వారు కలబందను తినకూడదు. కలబందలో మన శరీరానికి ఉపయోగపడే అనేక ఔషధ గుణాలతోపాటు విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందువల్ల కలబందను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.
కలబందను రోజూ ఒక టీస్పూన్ మోతాదులో జెల్ తినవచ్చు. అదే జ్యూస్ అయితే రోజూ 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. కలబందలో విటమిన్లు ఎ, సి, ఇ, పలు రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్ ఎ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కంటి చూపును మెరుగు పరుస్తుంది. కలబందను రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు పెరిగి కళ్లద్దాలను తీసి పడేస్తారు. ఇక కలబందలో ఉండే విటమిన్ సి మన శరీర ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. తీవ్రమైన వ్యాధులు రాకుండా ఉంటాయి.
కలబంద మన జీర్ణవ్యవప్థకు ఎంతో మేలు చేస్తుంది. కలబందను రోజూ తింటుంటే జీర్ణవ్వవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కలబంద శిరోజాలు, ముఖానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీంతో తయారు చేసే ఫేస్ ప్యాక్ లేదా హెయిర్ ప్యాక్‌లను ఉపయోగించడం వల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాదు, శిరోజాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఇలా కలబంద వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.