HomeHealthHow Many Days Per Week Should We Take Head Bath
Head Bath | తలస్నానం రోజూ చేస్తే జుట్టు పలచబడుతుందా? వారానికి ఎన్నిసార్లు చేస్తే బెటర్?
అందరి జుట్టు ఒకేలా ఉండదు.. కాబట్టి తలస్నానం విషయంలో కూడా ఇతరులను చూసి ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. మన జుట్టు లక్షణాన్ని బట్టి తలస్నానం ఎన్నిసార్లు చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. అదెలా అంటే..
2/7
జుట్టు రాలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెంట్రుకలు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా జుట్టు గురించి ఆలోచించని వారుండరు.
3/7
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు రోజూ తలస్నానం చేస్తుంటారు. డాండ్రఫ్ వంటి సమస్యలు తగ్గాలని అధిక గాఢత కలిగిన షాంపులను వాడుతుంటారు. దీనివల్ల జుట్టుకు పోషణ అందడం మాట అటుంచితే మరింత పలచగా తయారవుతుంటాయి. అందుకే తలస్నానం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
4/7
ఆయిలీ హెయిర్ ఉండేవారు ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తలస్నానం చేసిన ప్రతిసారి జుట్టుకు కొంత సిరం, నూనెను అప్లై చేయాలి. ఇలా చేస్తే క్రమంగా జుట్టుకు పోషణ అందుతుంది.
5/7
పొడిబారిన జుట్టు ఉన్నదంటే జుట్టుకు అవసరమైన తేమ లోపించిందని అర్థం. షాంపూతో జుట్టును తరచూ శుభ్రం చేసుకోవడం వల్ల వెంట్రుకలు మరింత తేమను కోల్పోతుంది. పొడి జుట్టు ఉన్నవారు వారంలో రెండుసార్లు 2 నుంచి మూడు రోజుల విరామంతో తలస్నానం చేయవచ్చు.
6/7
మందపాటి జుట్టు ఉన్న వారు వారానికి ఒకసారి తలస్నానం చేయడం మంచిది. జుట్టు ఒత్తుగా ఉండి చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు వారానికి రెండుసార్లు స్నానం చేస్తే మంచిది.
7/7
పొడవాటి జుట్టు ఉన్నవారు జుట్టును తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇతర జుట్టు రకాలతో పోలిస్తే దట్టమైన జుట్టు ఉన్న వారికి ఆయిల్, జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు తలస్నానం చేయాలని ఉంటుంది. కానీ ప్రతి రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు పలుచబడుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తే మంచిది.
8/7
ఉంగరాల జుట్టు ఉన్నవారు ప్రతి మూడు రోజులకు ఒకసారి తల స్నానం చేస్తే మంచిది. వదులుగా పలుచగా జుట్టు ఉన్నవారు రోజు విడిచి రోజు తలస్నానం చేసినా మంచిదే. అధిక రసాయనాలు ఉండే షాంపూలకు బదులు సహజ సిద్ధ మార్గాలను అనుసరిస్తే మంచిది.