Caffeine | జుట్టు, చర్మంపై కెఫిన్ ప్రభావం ఉంటుందా..?
Caffeine | నిత్యం కాఫీని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండగా.. ఎక్కువ మొత్తంలో సేవించడం ద్వారా సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మన జుట్టు, చర్మంపై..
Caffeine | మనలో చాలా మంది తమ దినచర్యను వేడి వేడి కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే కాఫీ సిప్ లేనిదే వెలితీగా ఫీలవుతుంటారు. కొందరైతే రోజులో ఎక్కువ సార్లు కాఫీ సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, నిత్యం కాఫీని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండగా.. ఎక్కువ మొత్తంలో సేవించడం ద్వారా సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మన జుట్టు, చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
కాఫీలో కెఫిన్ లోడ్ అయి ఉంటుంది. కాఫీని సేవించడం ద్వారా ఉత్తేజితం పొంది మరింత ఎక్కువ ఉత్పాదకత వచ్చేలా పనిచేస్తున్నాం. ఇదే సమయంలో కెఫిన్ తీసుకోవడం వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఆందోళన పెరగడం, నిద్రలేమి సమస్యలను చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జుట్టుపై కెఫిన్ ప్రభావం
జుట్టు రాలడాన్ని నయం చేయడంలో కెఫిన్ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే కెఫిన్ ఒక సంకలితంగా స్కాల్ప్‌లోకి మందు చొచ్చుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇది హెయిర్ ఫోలికల్స్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. కెఫిన్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది ఇది తల ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని సాఫీగా సాగేలా సాయపడుతుంది.
ఇటీవలి కాలంలో చాలా మంది మగవారు బట్టతల లేదా జుట్టు రాలడంతో బాధపడుతున్నారు. ఇది జన్యుపరమైన కారకాలు లేదా డీహెచ్‌టీ (డైహైడ్రోటెస్టోస్టెరాన్) స్థాయి పెరుగుదల వల్ల కావచ్చు. డీహెచ్‌టీ ఒక శక్తివంతమైన టెస్టోస్టెరాన్. దీని స్థాయిల పెరుగుదల జుట్టు రాలడానికి కారణమవుతుంది. కెఫిన్ ఈ హార్మోన్ ప్రతికూల ప్రభావాలను అడ్డుకుంటుంది. ఫలితంగా జుట్టు నష్టం నివారణ, చికిత్స అవసరం లేకుండా చేస్తుంది.
జుట్టు రాలకుండా నిరోధించడంలో కెఫిన్ సాయపడుతున్న విషయం నిజమే అయినప్పటికీ, ఎక్కువ మొత్తంలో నిత్యం కెఫిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ జుట్టు రాలకుండా నిరోధిస్తుందనేది తేలలేదు.
చర్మంపై కెఫిన్ ప్రభావం
కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందనే అపోహ ఉన్నది. దీని వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుందని చాలా పొరపడుతుంటారు. అయితే, ఇది పూర్తిగా కచ్చితమైనది కాదు. కెఫిన్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి చర్మాన్ని దెబ్బతీసే ప్రీ రాడికల్స్‌తో పోరాడటంలో సాయపడతాయి.
చక్కెర కలిపిన కాఫీ రూపంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయి. మితంగా కెఫిన్ తీసుకోవడం చాలా మంచిది. అయితే, అధిక వినియోగం హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
కెఫిన్ అధిక వినియోగం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదలను పెంచుతుంది. ఫలితంగా అధిక ఇన్సులిన్ స్థాయిలు ఏర్పడి చర్మంలో మంటను పెంచుతుంది. అలాగే నూనె ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది.
అధిక వినియోగం ప్రతికూలతలు
- ఎవరైతే ఎక్కువ సేపు మేల్కొని ఉంటారో వారి శరీరం ఎక్కువ అడెనోసిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వారిని నిద్రపోయేలా చేస్తుంది. అయితే కెఫిన్ అడెనోసిన్ గ్రాహకాలను అడ్డుకుని నిద్ర సామర్ధ్యానికి అంతరాయం కలిగిస్తుంది.
- కెఫిన్ అధిక వినియోగం శరీరంలో అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుంది. ఇదే మనలో ఆందోళన, చికాకులకు కారణమవుతుంది.
- కెఫిన్ వినియోగం ఎక్కువైతే శరీరంలో యాసిడ్ స్రావాన్ని ప్రభావితం చేసి యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత దిగజార్చుతుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
- కెఫిన్ పదార్థాలు మనపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంటాయి. అందుకని మితంగా వినియోగించి ప్రయోజనం చేకూరేలా చూసుకోవాలి. అంతేకానీ, అధికంగా వాడి ఇబ్బందులను కొనితెచ్చుకోవద్దు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

