Mango Leaves | వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు లభిస్తాయి. సీజనల్ ఫ్రూట్ అయిన ఈ పండ్లను వేసవి కాలంలో తింటే అనేక లాభాలను పొందవచ్చు. మామిడి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మామిడి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అజీర్తి, అసిడిటీ, మలబద్దకం ఉన్నవారు మామిడి పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. మామిడి పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అయితే కేవలం పండ్లే కాదు, మామిడి ఆకులు కూడా మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఈ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నయం చేసేందుకు దోహద పడతాయి.
డయాబెటిస్ ఉన్నవారికి మామిడి ఆకులను ఒక వరంగా చెప్పవచ్చు. 10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకుని బాగా కడిగి ఒక పాత్రలోని నీటిలో వాటిని వేసి ఆ నీళ్లను బాగా మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను చల్లార్చి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి పరగడుపునే అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. షుగర్ లెవల్స్ పూర్తిగా అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఇలా నీళ్లను తయారు చేసే సదుపాయం లేని వారు మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడిగా చేసి దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపునే అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగాలి. షుగర్ మరీ ఎక్కువగా ఉన్నవారు రాత్రి పూట భోజనానికి ముందు కూడా ఈ నీళ్లను తాగాలి. ఇలా చేస్తున్నా కూడా షుగర్ అదుపులోకి వస్తుంది.
మామిడి ఆకులను కొన్ని తీసుకుని నీడలో ఎండబెట్టాలి. ఆ ఆకులను పొడిగా చేయాలి. అనంతరం ఆ పొడిని పెనంపై వేయించి బూడిదలా మార్చాలి. అందులో కాస్త కొబ్బరినూనె కలిపి మెత్తని పేస్ట్‌లా మార్చాలి. ఈ మిశ్రమాన్ని రాస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. దీన్ని రాత్రి పూట మొటిమలపై రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో మొటిమలు తగ్గుతాయి. ఈ మిశ్రమం గాయాలు, పుండ్లు మానేందుకు కూడా పనిచేస్తుంది. మామిడి ఆకులను నీటితో కలిపి మెత్తగా నూరి పేస్ట్‌లా చేయాలి. అందులో కాస్త పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి రాయాలి. 15-20 నిమిషాలు ఆగిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే డల్ నెస్ తగ్గుతుంది. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖం అందంగా కనిపిస్తుంది.
మామిడి ఆకులను నీటితో కలిపి మెత్తగా నూరి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమంలో కాస్త ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ ప్యాక్‌లా జుట్టుకు బాగా రాయాలి. 20 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఈ హెయిర్ ప్యాక్‌ను ఉపయోగిస్తుంటే శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు తగ్గిపోతుంది. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను మీరు స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. దీంతో చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి ఆకులను నీటితో కలిపి నూరి మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కాస్త కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిలో కాస్త తేనె కలిపి తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభించి రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. మామిడి ఆకుల నుంచి రసం తీసి దాన్ని కొద్దిగా వేడి చేయాలి. ఆ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల చొప్పున చెవిలో వేయాలి. దీంతో చెవి నొప్పి, చెవి ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. మామిడి ఆకులను కాల్చగా వచ్చే పొగను పీలుస్తుంటే వెక్కిళ్లు తగ్గిపోతాయి. గొంతులో గరగర, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో రోజూ తాగుతుంటే బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది. ఇలా మామిడి ఆకులతో అనేక చిట్కాలను పాటించి అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే అలర్జీలు ఉన్నవారు మామిడి ఆకులను ఉపయోగించకూడదు.