ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా! మీ కిచెన్‌లో ఉండే వీటిని ట్రై చేసి చూడండి
ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలను పోగొట్టుకునేందుకు యువతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వంటింట్లో దొరికే వస్తువులతో ముఖంపై మచ్చలను పోగొట్టుకుని చర్మం మెరిసిపోయేలా చేసుకోవచ్చు.

ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు అమ్మాయిల అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖంపై మొటిమలు రావడానికి తినే ఆహారం మొదలు కాలుష్యం, ఇలా చాలా కారణాలు ఉంటాయి. కారణమేదైనా సరే.. మొటిమలను పోగొట్టుకునేందుకు యువతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రీములు, సౌందర్య లేపనాలను వాడుతుంటారు. అయితే మొటిమలను పోగొట్టుకునేందుకు రసాయనాలతో తయారు చేసిన క్రీములతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే వస్తువులతో ముఖంపై మచ్చలను పోగొట్టుకుని చర్మం మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఆలుగడ్డలు
ముఖంపై మచ్చలను ఆలుగడ్డలు పోగొడతాయి. ఆలుగడ్డలను ముక్కులుగా చేసి మచ్చలు ఉన్న చోట ఉంచాలి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆలుగడ్డలను గుజ్జుగా చేసి.. అందులో టీస్పూన్ తేనె కలిపి మచ్చలు ఉన్న చోట రాసి పావుగంట వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం ద్వారా ముఖంపై మచ్చలు పోతాయి.

మజ్జిగ-టొమాటో
మజ్జిగలో కొంత టొమాటో రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. వారంలో రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

పెరుగు-నిమ్మరసం
ఒక టేబుల్ స్పూన్ పెరుగులో కొంచెం నిమ్మరసం కలిపి.. మచ్చలు ఉన్న చోట పూస్తే కూ మచ్చలు పోయి చర్మం మెరిసిపోతుంది.

ఓట్స్
ఓట్స్‌ను గ్రైండ్ చేసి కొంచెం నిమ్మరసం వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖంపై మర్దనా చేసుకోవాలి. పావు గంట తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకటి రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

పాలు-తేనె
రెండు టేబుల్ స్పూన్ పాలల్లో ఒక స్పూన్ తేనె వేసి దూదితో మచ్చలు ఉన్న చోట రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాలల్లో తేనెకు బదులు పసుపు ఉపయోగించినా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

అలోవెరా
మచ్చలు ఉన్న చోట అలోవెరాను పూసి మసాజ్ చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే కొన్ని వారాల్లోనే మచ్చలు మాయమవుతాయి.

బొప్పాయి
బొప్పాయిని గుజ్జుగా చేసి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒత్తిడి తగ్గితే శిరోజాలకు శుభవార్తే!
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
వర్షాకాలంలో ఈ కాయలు తప్పనిసరిగా తినాలి..! ఎందుకంటే..?
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

