Holi 2024 | రంగుల పండుగ హోలీ వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పసైందన వంటకాలు సైతం ప్రత్యేకంగా నిలుస్తాయి. గత కొన్నేళ్లుగా హోలీ రోజున.. మరుసటి రోజున మద్యం సేవించడం అలవాటుగా మారింది. పండుగ రోజున ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఇటీవల గణాంకాలు పేర్కొంటున్నాయి. పండుగ సమయంలో చిన్న పొరపాటు చేసినా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోలీ సందర్భంగా ఎంజాయ్మెంట్ పేరుతో అతిగా మద్యం సేవించడంతో ఆల్కహాల్ పాయిజనింగ్ రిస్క్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రక్తంలో ఎక్కువ ఆల్కహాల్ ఉండడడంతో శరీరం సరిగా ఫిల్టర్ చేయకపోవడంతో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన, ప్రాణాంతక దుష్ప్రభావాలను కలిగిస్తుందని పేర్కొంటున్నారు.
ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని.. హోలీ సమయంలో ఇలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్కహాల్ పాయిజనింగ్ ప్రమాదం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడమే కారణమని స్పష్టం చేస్తున్నారు. అయితే, మధుమేహం, గుండెజబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు కొద్దిపాటి ఆల్కహాల్ సైతం తీవ్రమైన సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. మద్యపానం శ్వాసక్రియ, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కోమా వంటి సమస్యలు సైతం ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మద్యపానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆల్కహాల్ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆల్కహాల్ తాగడంతో శరీరం సరిగ్గా రక్తాన్ని శుద్ధి చేయలేకపోతుంది. రక్తంలో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండడంతో వాంతులు, మూర్ఛ, గందరగోళం అనిపించడం, హృదయ స్పందన రేటు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి కారణమవుతుంది. ఆల్కహాల్ పాయిజనింగ్ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే.. అది కోమాకు కూడా దారి తీస్తుందని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్న ఆల్కహాల్ శరీరానికి ఎంతో హాని చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ఆల్కహాల్ తీసుకున్నారు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆల్కహాల్‌తో రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. బీపీ పెరిగితే గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి పూర్తి దూరం పాటించాలని వైద్యలు సూచిస్తున్నారు.
ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అని వైద్యులు పేర్కొంటున్నారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. విపరీతమైన మద్యపానంతో వాంతులు వస్తాయని.. కొన్నిసార్లు వాంతులు ముక్కు ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయని.. దాంతో శ్వాసకోశ సమస్యలు పెంచుతుందని పేర్కొన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గి వాంతుల కారణంగా తీవ్రమైన డీహైడ్రేషన్ ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అయితే, తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం శరీరానికి హానికరమేనని వైద్యులు స్పష్టం చేశారు. హోలీ పండుగ సమయంలో ఎవరూ మద్యం వైపు వెళ్లకుండా ఆరోగ్యానికి కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.