RTC Women Employees | పండుగపూట డబుల్ డ్యూటీ..! రాఖీ రోజున విధులకు రావాలని ఆర్టీసీ ఆదేశాలు
ఏటా శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు అక్కాచెల్లెలు రాఖీ కట్టడానికి వస్తారని అన్నాదమ్ములు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పండుగను మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం దూరంచేస్తున్నది.
- రాఖీ రోజున విధులకు రావాలని ఆర్టీసీ ఆదేశాలు
- ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా ఉద్యోగులు
- యాజమాన్యం తీరుపై నాయకుల మండిపాటు
కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 26 : ఏటా శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు అక్కాచెల్లెలు రాఖీ కట్టడానికి వస్తారని అన్నాదమ్ములు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పండుగను మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం దూరంచేస్తున్నది. ఈ నెల 28 రాఖీపౌర్ణమి రోజున కూడా విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు అన్ని డిపోలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
పండుగ ముందు రోజు, పండుగ రోజు 36 గంటలు డబుల్ డ్యూటీ (డీడీ) నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. ఏదైనా కారణంతో విధులకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ రోజు విధులకు హాజరుకావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ డ్యూటీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. పండుగ రోజు మహిళా ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

