High Cholesterol Symptoms | ఒకప్పుడు కేవలం వయస్సు మీడ పడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్‌లు వచ్చేవి. కానీ ఇప్పుడు చాలా మంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, మద్యం విపరీతంగా సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి దాంతో హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. వాస్తవానికి హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇది వస్తుంది. దీంతో కూర్చున్న చోటనే చాలా మంది కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఇలాంటి హార్ట్ ఎటాక్‌లకు కొలెస్ట్రాల్ ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరితే అది రక్త నాళాల్లో పేరుకుపోతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపై భారం పడుతుంది. దీని వల్ల రక్తాన్ని పంపు చేసేందుకు గుండె అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. అలాగే బీపీ అధికంగా ఉన్నా కూడా హార్ట్ ఎటాక్‌కు కారణం అవుతుంది. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటే మాత్రం శరీరం మనకు పలు సంకేతాలను ఇస్తుంది. కొన్ని లక్షణాలను ముందుగానే మనకు తెలియజేస్తుంది. వాటిని గుర్తించడం ద్వారా కొలెస్ట్రాల్ అధికంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీంతో గుండెకు హాని జరగకుండా చూసుకోవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే రక్త నాళాల్లో అది పేరుకుపోతుంది కనుక రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. మీకు ఉన్నట్లుండి సడెన్‌గా బీపీ పెరుగుతుంది అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఛాతిలో సూదులతో గుచ్చినట్లు నొప్పి వస్తుంది. ఇది హార్ట్ ఎటాక్ నొప్పికి భిన్నంగా ఉంటుంది. ఛాతిలో ఏ ప్రదేశంలో అయినా సరే సూదుల్తో గుచ్చినట్లు లేదా గట్టిగా అదిమి పట్టినట్లు నొప్పి వస్తుంది అంటే అది అధిక కొలెస్ట్రాల్ వల్లనే అని అర్థం చేసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే వెంటనే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇక కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఛాతి అంతా పట్టేసినట్లు అవుతుంది. కొందరికి ఛాతిలో చేయి పెట్టి తిప్పినట్లు కూడా అనిపిస్తుంది. ఛాతిపై బరువు పెట్టినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ కొలెస్ట్రాల్ అధికంగా ఉందని తెలిపే లక్షణాలే. కొందరికి నొప్పి ఛాతి మధ్యలో వస్తుంది. కొందరికి ఎడమ వైపు వస్తుంది. అలాగే ఎడమ చేతిలో నొప్పిగా కూడా ఉంటుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి దవడ నుంచి మెడ మీదుగా ఎడమ భుజం వైపు వెళ్తుంది. ఇలా గనక ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే పొత్తి కడుపు పైభాగంలో తరచూ నొప్పిగా ఉంటుంది. అదే భాగంలో వెనుక వైపు కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొందరికి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం అనిపిస్తాయి. తరచూ అజీర్తి లేదా గుండెల్లో మంటగా కూడా ఉంటుంది. కడుపులో నొప్పిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ తరచూ చెమటలు పడుతుంటాయి. తలతిరిగినట్లు అనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. మెట్లు ఎక్కినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఆందోళన, కంగారు ఉంటాయి. ఇలా అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నవారికి సంకేతాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ లక్షణాలు కేవలం లావుగా ఉన్నవారిలోనే కనిపిస్తాయని అనుకోకూడదు. దీనికి బరువుతో సంబంధం లేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.