Health Tips | నిద్రలేమి, ఫుడ్ హాబిట్స్, మానసిక ఒత్తిళ్లు తలనొప్పికి కారణం అవుతాయి. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలోని కెఫిన్, పెరుగులోని టైరమైన్, పులుపు పదార్థాల్లో ఉండే సిట్రస్ తలనొప్పిని రేకెత్తిస్తాయి. మన డైట్లో కొద్దిపాటి తేడాలతో తలనొప్పికి ఇట్టే టాటా చెప్పేయొచ్చు.