రెగ్యూలర్‌గా మందు తాగేవాళ్లలో చాలా మంది ఏం తినకుండా తాగుతుంటారు. తిన్న తర్వాత తాగితే కిక్ ఎక్కదని కొందరు.. తింటే వాంతి అవుతుందని కొందరు… తిన్నాక తాగితే ఎక్కువ తాగలేమని కొందరు ఇలా ఎవరి వాదన వారిది. కానీ… ఏం తినకుండా ఖాళీ కడుపుతో తాగితే చాలా ప్రమదమని వైద్యులు చెబుతున్నారు. తాగే ముందు, లేదా తాగుతున్నపుడు ఏదో ఒకటి తినాలని సూచిస్తున్నారు.
తినకుండా తాగితే ఆల్కహాల్ అనేది బాడీలో చాలా ఫాస్ట్‌గా అబ్జార్బ్ అవుతెంది. అంటే మద్యం తొందరగా మన బాడీ అంతా సర్క్యూలేట్ అవుతుంది. దీనివల్ల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదముంటుంది. మందు తాగేవారు ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆల్కహాల్ తీసుకుంటున్నపుడు జనరల్‌గా బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. అందుకే మద్యలో నీళ్లు కూడా కొంచె కొంచెం సిప్ చేస్తూ ఉండాలి. ఆల్కహాల్ తీసుకుంటున్నపుడు స్పైసీ ఫుడ్ జోలికి పోగూడదు. ఫ్రూట్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే మంచిది.