Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
Health tips | తరచూ పచ్చికొబ్బరి (Raw Coconut) తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పచ్చికొబ్బరిని చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో చట్నీగా, తీపి వంటకాల్లో పచ్చి కొబ్బరిని వినియోగిస్తుంటారు. చక్కెరగానీ, బెల్లంగానీ కలుపుకుని కూడా తింటుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామని ఈ పచ్చి కొబ్బరిని దూరం పెడుతారు.
Health tips : తరచూ పచ్చికొబ్బరి (Raw Coconut) తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పచ్చికొబ్బరిని చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో చట్నీగా, తీపి వంటకాల్లో పచ్చి కొబ్బరిని వినియోగిస్తుంటారు. చక్కెరగానీ, బెల్లంగానీ కలుపుకుని కూడా తింటుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామని ఈ పచ్చి కొబ్బరిని దూరం పెడుతారు. కానీ నిపుణులైతే పచ్చి కొబ్బరితో లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నారు. పచ్చి కొబ్బరిని తరచూ తగిన మోతాదులో తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు. పచ్చికొబ్బరి యాంటీ బయోటిక్‌గా పని చేస్తుందని, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు. పచ్చి కొబ్బరితో ఉండే ఆ లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి కొబ్బరితో లాభాలు..
రోగ నిరోధక శక్తి
పచ్చికొబ్బరిని వీలైనప్పుడల్లా తింటూ ఉంటే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం తప్పుతుంది.
మంచి కొలెస్ట్రాల్
పచ్చి కొబ్బరిని తరచూ తీసుకోవడంవల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దాంతో రక్తంలో ఎలాంటి మలినాలు ఏర్పడవు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణ శక్తి
పచ్చికొబ్బరిలో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దాంతో జీర్ణ సమస్యలు కూడా త్వరగా రావు. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
అదుపులో థైరాయిడ్
చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతూంటారు. ఇలాంటి వారికి పచ్చికొబ్బరి బాగా సాయపడుతుంది. పచ్చికొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్‌ను తగ్గిస్తాయి.
మెదడు ఆరోగ్యం
తరచూ పచ్చికొబ్బరి తినడంవల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పిల్లల ఎదుగుదలకు
ఎదిగే పిల్లలకు పచ్చికొబ్బరి చాలామేలు చేస్తుంది. పచ్చికొబ్బరిలో వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దాంతో పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే చిన్న వయసులోనే ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. కావాల్సిన శక్తి లభిస్తుంది.
చర్మం, కేశాల ఆరోగ్యం
పచ్చికొబ్బరి తరచూ తినడంవల్ల చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం కాంతివంతమవుతుంది. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. జుట్టు రాలడం ఆగిపోతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

