Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Health tips | సీజన్ ఏదైనా అందుబాటులో ఉండే పండు అరటిపండు (Banana). అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు (Health benifits) మెండుగా ఉన్నాయి. అందుకే మధుమేహం (Diabetis) లేనివాళ్లు ప్రతిరోజు ఒక అరటిపండైనా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్ (Carbohydrate), ప్రొటీన్స్ (Proteins) పుష్కలంగా ఉంటాయి.
Health tips : సీజన్ ఏదైనా అందుబాటులో ఉండే పండు అరటిపండు (Banana). అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు (Health benifits) మెండుగా ఉన్నాయి. అందుకే మధుమేహం (Diabetis) లేనివాళ్లు ప్రతిరోజు ఒక అరటిపండైనా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్ (Carbohydrate), ప్రొటీన్స్ (Proteins) పుష్కలంగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం (Constipation) ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. అజీర్తి (Indigetion) ని పోగొడుతుంది. మరి ఇంతటి ప్రత్యేకతలున్న అరటిపండు ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
1. అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు చాలా మంచిది. శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అరటిపండులో ఉండే పోషకాలు ఆస్తమా, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ను నివారిస్తాయి.
2. కిడ్నీల ఆరోగ్యానికి కూడా అరటిపండు ఉపకరిస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడంవల్ల కిడ్నీ సంబంధిత జబ్బుల బారినపడే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
3. అరటిపండులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకానికి మంచి మందు. రోజుకో అరటిపండు తింటే ఈ సమస్య తగ్గిపోతుంది.
4. అరటిపండులో కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తినవచ్చు. ఇందులో ఉండే పిండిపదార్థం కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది.
5. అరటిపండు పేగులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
6. అరటి పండులో ఉండే ‘బాన్‌లెక్’ అనే రసాయనానికి ఎయిడ్స్ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది. లెక్టిన్ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుని ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది.
7. అరటిపండులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. రాత్రిపూట పాలతో కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

