Red Color Radish | మనకు లభించే అన్ని రకాల కూరగాయల్లోనూ వివిధ వెరైటీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ముల్లంగిలోనూ పలు రకాలు ఉంటాయి. మనకు ఎక్కువగా తెలుపు, ఎరుపు రంగులో ఉండే ముల్లంగి లభిస్తుంది. సాధారణంగా చాలా మంది తెలుపు రంగు ముల్లంగినే తింటారు. కానీ ఎరుపు రంగు ముల్లంగి వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఈ ముల్లంగిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. ఎరుపు రంగు ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకనే అవి ఎరుపు రంగులో ఉంటాయి. కనుక ఈ ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఎరుపు రంగు ముల్లంగిలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. కనుకనే అవి ఆ రంగులో మనకు దర్శనమిస్తాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి.
ఎరుపు రంగు ముల్లంగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఎరుపు రంగు ముల్లంగిలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. విటమిన్ సి వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఫలితంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే విటమిన్ సి సహాయంతో శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. విటమిన్ సి వల్ల మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. మహిళలకు ఎంతగానో మేలు జరుగుతుంది.
ఎరుపు రంగు ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ముల్లంగిలో అధికంగా ఉండే నీటి శాతం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ఈ ముల్లంగిలో అధికంగా ఉండే నీటి వల్ల దీన్ని తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. మెటబాలిజం మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎరుపు రంగు ముల్లంగి కిడ్నీలు, లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయా అవయవాలు డిటాక్స్ అవుతాయి. వాటిల్లో ఉండే టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. దీంతో లివర్, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రం ధారాళంగా, సాఫీగా జారీ అవుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఎరుపు రంగు ముల్లంగిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు ఎరుపు రంగు ముల్లంగిని రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా ఎరుపు రంగు ముల్లంగిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. దీన్ని నేరుగా లేదా ఉడకబెట్టి ఎలా తిన్నా సరే లాభాలు కలుగుతాయి.