Fennel Seeds | భోజనం చేసిన అనంతరం చాలా మంది రకరకాల ఆహారాలను తింటుంటారు. లేదా జ్యూస్‌లు, ఇతర డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. భోజనం చేశాక కొందరు టీ, కాఫీ తాగుతారు. అయితే వాస్తవానికి భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటుండాలి. మన పెద్దలు భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలే వారు. అందుకనే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ మనం అలా చేయడం లేదు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సైతం చెబుతున్నారు. మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సోంపు గింజలు ఎంతగానో పనిచేస్తాయి. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను గుప్పెడు తీసుకుని నమిలితే ఎన్నో లాభాలను పొందవచ్చు.
సోంపు గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. పోషకాలకు వీటిని గనిగా చెప్పవచ్చు. ఈ గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ గింజలను తింటే మనకు పోషణ లభిస్తుంది. ఈ పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ గింజల్లో అనెథోల్ ఉంటుంది. ఇది జీర్ణాశయ ఎంజైమ్‌లను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
సోంపు గింజల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ గింజలను నోట్లో వేసుకుని నమిలితే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోరు శుభ్రమవుతుంది. నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. కనుకనే భోజనం చేసిన అనంతరం నోరు శుభ్రంగా ఉండేందుకు మన పెద్దలు అప్పట్లో సోంపు గింజలను నమిలే వారు. అలాగే ఈ గింజలను నమిలితే ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలో ఉండు కొవ్వు కరుగుతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్న వారు భోజనం చేసిన అనంతరం రోజూ సోంపును తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ గింజల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. బీపీ ఉన్నవారికి సోంపు గింజలు ఒక వరమనే చెప్పవచ్చు. వీటిని రోజూ తింటుంటే బీపీని కంట్రోల్ చేయవచ్చు. ఇలా భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను నమలడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.