Glyphosate | గ్లైఫోసేట్ను పంటల్లో కలుపు నివారణకు వాడతారు. ఇది పంటలకు హాని కలిగించకుండానే కలుపును నిర్మూలిస్తుంది. కాబట్టి, రైతులు దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఏండ్ల తరబడి జరిగిన అధ్యయనాల ద్వారా ైగ్లెఫోసేట్ మనుషుల్లో క్యాన్సర్కు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఆహారం రూపంలో అంతగా హాని కలిగించనప్పటికీ ైగ్లెఫోసేట్ ఆధారిత రసాయనాలు మనుషులను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తాయి. చర్మం మండుతుంది. శ్వాసిస్తే ముక్కు రంధ్రాల్లో ఇబ్బందిగా ఉంటుంది.
కొన్నిసార్లయితే తీవ్రతను బట్టి కాలేయం, కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. మరణం కూడా సంభవించవచ్చు. అంతేకాదు… ైగ్లెఫోసేట్ గర్భిణుల మీద మరింత దుష్ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయం ఏ కొంచెం తగ్గినా కూడా పుట్టబోయే శిశువు జీవితంపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. పైగా బిడ్డ పుట్టకముందే శాశ్వత నష్టం కూడా జరగవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా శరీర పెరుగుదలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. గర్భిణులపై ైగ్లెఫోసేట్ ప్రభావం గురించి అమెరికాకు చెందిన ‘ది ఎన్విరాన్మెంటల్ హెల్త్ యూనిట్’ జరిపిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి.
అధ్యయనం కోసం పరిశోధకులు 18 – 40 సంవత్సరాల మధ్య వయసున్న 77 మంది మహిళల్ని ఎంచుకున్నారు. వీరిని 2015 జూన్ నుంచి 2016 జూన్ వరకు పరీక్షించారు. వీరి మూత్రం నమూనాల్లో దాదాపు 93 శాతం మందిలో ైగ్లెఫోసేట్ అవశేషాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. మొదట్లో దీనికి కారణం నీళ్లు కావచ్చని అనుకున్నారు. కానీ కలుపు నివారణకు ైగ్లెఫోసేట్ వాడటం వల్ల ఆయా పంటలను ఆహారంగా తీసుకోవడంతో ఈ దుస్థితి దాపురించిందని ఇప్పుడు అనుమానిస్తున్నారు.
ఇది చిన్న అధ్యయనమే అయినప్పటికీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది పరిశోధకుల హెచ్చరిక. మరో విషయం… గర్భిణులు తమ తొలి మూడు నెలల కాలంలో ఈ కలుపు నివారిణికి దూరంగా ఉండాలంటున్నారు పరిశోధకులు. లేదంటే తల్లిపాల ద్వారా కలుపుమందు అవశేషాలు పిల్లలకు చేరుకుంటాయి. కాబట్టి, రైతులు కూడా ైగ్లెఫోసేట్కు ప్రత్యామ్నాయాలను వాడాలి. గర్భిణులు తొమ్మిది నెలలపాటు ఈ కలుపుమందు ప్రభావం అసలే పడకుండా జాగ్రత్త వహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.