Foods To Prevent Cancer | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మందిని మృత్యువు బారిన పడేస్తున్న రోగాల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ అనేది ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. చాలా మందికి అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవి వచ్చేందుకు కారణాలు కూడా అంతుబట్టడం లేదు. కనుక క్యాన్సర్ వచ్చాక బాధపడడం కన్నా అది రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను రోజూ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ జార్జియా సైంటిస్టుల పరిశోధనల ప్రకారం ఒమెగా 3 లేదా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తేలింది. ఈ మేరకు గాను వారు 2.50 లక్షల మంది తీసుకునే ఫుడ్‌పై అధ్యయనం చేశారు. ఒమెగా 3 లేదా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయని తేల్చారు. కనుక ఈ ఆహారాలను రోజువారి భోజనంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు.
సాధారణంగా చేపలను చాలా మంది తింటుంటారు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కనుక వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అయితే చేపలను తినలేని వారికి అవిసె గింజలను ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. చేపలతో సమానమైన పోషకాలు అవిసె గింజల్లో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కేవలం చేపల్లోనే కాదు, అవిసె గింజల్లోనూ ఉంటాయి. కనుక రోజూ గుప్పెడు అవిసె గింజలను తింటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అవిసె గింజల్లో ఆల్పా లినోలినిక్ యాసిడ్, వృక్ష సంబంధ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కనుక అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
చియా విత్తనాల ద్వారా కూడా మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అనేక తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వాల్ నట్స్‌లోనూ వృక్ష సంబంధ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా క్యాన్సర్ వచ్చే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ వాల్ నట్స్‌ను తింటే ఈ ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది. దీంతో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. కనుక రోజూ గుప్పెడు వాల్ నట్స్‌ను తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడడంతోపాటు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
మన ఆరోగ్యానికి ఆవనూనె ఎంతో మేలు చేస్తుంది. పూర్వ కాలంలో ఆవనూనెను అధికంగా ఉపయోగించేవారు. కనుక వారు ఎన్నో ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండేవారు. ఆవ నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక దీన్ని తరచూ ఉపయోగిస్తుండాలి. దీంతో క్యాన్సర్ రాదు. అలాగే ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతాయి. క్యాన్సర్ వచ్చే రిస్క్‌ను తగ్గిస్తాయి. ఆవాలు లేదా ఆవనూనెను తరచూ ఉపయోగిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.