Muscle Strength | తీరైన దేహాకృతి కోసం ఏ ఆహార పదార్ధాలు అవసరం అంటే..!
కండలు తీరిన దేహం కోసం (Muscle Strength) జిమ్‌లో కసరత్తులు ఎంత అవసరమో మనం వంటింట్లో వాడే పదార్ధాలు, దినుసులు కూడా కీలకం. వ్యాయామం, ఆహారంతోనే తీరైన దేహాకృతిని సొంతం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ : కండలు తీరిన దేహం కోసం (Muscle Strength) జిమ్‌లో కసరత్తులు ఎంత అవసరమో మనం వంటింట్లో వాడే పదార్ధాలు, దినుసులు కూడా కీలకం. వ్యాయామం, ఆహారంతోనే తీరైన దేహాకృతిని సొంతం చేసుకోవచ్చు. మనం రోజూ తీసుకునే ఆహార పదార్ధాలే సహజంగా కండరాల బలోపేతానికి ఉపయోగపడతాయి. వ్యాయామం ఎంత చేసినా కండలు కలగాలంటే అందుకు తగిన ఆహారం తీసుకోవాలి. ఫ్యాన్సీ సప్లిమెంట్స్, కఠినమైన డైట్ ప్లాన్స్‌ను పక్కనపెట్టి ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో కండ పుష్టిని పొందే వీలుంది.
కండరాలు, ఎముక పుష్టి అంటే ముందుగా ప్రొటీన్స్తో కూడిన ఆహారం అధికంగా తీసుకోవాలి. ప్రొటీన్లు శరీర నిర్మాణానికి కీలకంతో పాటు శరీర మరమ్మత్తులు, కండర కణజాలాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రొటీన్ అధికంగా ఉన్న మాంసం, గుడ్లు, డైరీ ఉత్పత్తులు తరచూ తీసుకుంటే కండరాల వృద్ధికి అవసరమైన ఎమినో యాసిడ్స్ లభిస్తాయి. ఇక కండ కలగాలనుకునే వారు కార్బోహైడ్రేట్లను దూరం పెడుతూ కఠిన డైట్లు అనుసరిస్తున్నారు. తక్షణ శక్తిని కార్బోహైడ్రేట్లు అవసమరమని, కండరాలు వీటిని కోరుకుంటాయని మెడికల్ న్యూస్ టుడే వెల్లడించింది.
కండర నిర్మాణానికి తగినంతగా కార్బ్స్ తీసుకోవాలి. వర్కవుట్స్ సందర్భంగా తలెత్తే అలసటను కార్బోహైడ్రేట్లు నిలువరిస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ శక్తిని దశలవారీగా విడుదల చేస్తాయి. ఇక సహజంగా కండలు పెరగాలంటే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, పాలు, పెరుగు వంటి గ్రీక్ యోగర్ట్, సాల్మన్, గుడ్లు, క్వినోవా, పాలకూర, చికెన్‌తో పాటు ఆరోగ్యకర ఫ్యాట్స్, ప్రొటీన్, సూక్ష్మ పోషకాలు అధికంగా లభించే బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, జీడిపప్పు వంటి నట్స్, సీడ్స్ అధికంగా తీసుకోవాలి.
Read More :
IIT Kanpur professor | ఆరోగ్యం జాగ్రత్త అంటూనే కుప్పకూలాడు : ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హఠాన్మరణం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

